మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మధ్య గ్యాప్‌పై గత మూడునాలుగు సంవత్సరాలుగా రకరకాల వార్తలు వస్తూనే ఉంటున్నాయి.
ఇలా ఎన్నిసార్లు వార్తలు వచ్చినా చిరు పెద్ద తమ్ముడు నాగబాబు మాత్రం అన్న చిరు వెంటే ఉంటున్నారు.
మెగా ఫ్యామిలీ హీరోల ఆడియో ఫంక్షన్లు, ఇతరత్రా ఫంక్షన్లు జరిగినప్పుడు మెగా అభిమానులు పవన్ పవన్.అంటూ ఒక్కటే కేకలు వేయడంతో నాగబాబు రెండుమూడుసార్లు పవన్ ఫ్యాన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు దమ్ముంటే మీరంతా పవన్ ఇంటిముందుకు వెళ్లి ధర్నా చేసి.ఫంక్షన్లకు పవన్ ఎందుకు రావడం లేదో పవన్‌నే అడగాలని వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
తర్వాత పవన్ ఫ్యాన్స్ నాగబాబును టార్గెట్‌గా చేసుకుని విమర్శలు కూడా చేశారు.ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు కూడా పవన్ డుమ్మా కొట్టాడు.
ఈ ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు చిరు సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇలా చిరు వర్సెస్ పవన్ కాంట్రవర్సీ మ్యాటర్‌లలో నాగబాబు చిరుకే మద్దతుగా ఉంటున్నారు.
గతంలో నాగబాబు రాంచరణ్‌తో ఆరెంజ్ సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.అప్పుడు పవనే అందరికంటే ఎక్కువుగా సాయం చేసి తనను ఆదుకున్నాడని నాగబాబే స్వయంగా చెప్పాడు.
ఇక ఇదే క్రమంలో తర్వాత నాగబాబు చిరుకే ఎక్కువ సపోర్ట్ చేసినా ప్రస్తుతం మరోసారి తమ్ముడికి దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.పవన్ తాజాగా విశాఖలో ప్రత్యేక హోదా నిరసనకు మద్దతు ఇవ్వగా నాగబాబు కూడా పవన్‌కు మద్దతు తెలిపాడు.
ఇక ఇదే క్రమంలో జనసేనలో చేరే విషయంపై నాగబాబు మాట్లాడుతూ తన తమ్ముడు పవన్ కోరితే పవన్‌కు సాయం చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కుండబద్దలు కొట్టేశాడు.అలాగే తనంతట తానుగా కూడా పవన్ వద్దకు వెళ్లి సాయం చేసే టైం వస్తే తప్పకుండా చేస్తానని కూడా చెప్పాడు.
తమ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో వైరుధ్యాలు ఉన్నా తాను మాత్రం పవన్ పార్టీ కోసం పని చేస్తానని నాగబాబు చెప్పారు.నాగబాబు త్వరలోనే జనసేనలో చేరి ఏపీ వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసేందుకు, కమిటీలు వేసేందుకు పర్యటనలు చేస్తారని తెలుస్తోంది.2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబు జనసేన తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మరి నాగబాబు పొలిటికల్ రూటు ఎలా ఉంటుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy