Nag ashwin : ప్రాజెక్ట్ కే మూవీలో కే అంటే అర్థం అదే.. ఆ సీక్రెట్ లను రివిల్ చేసిన నాగ్ అశ్విన్?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రభాస్ ప్రస్తుతం వరసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బిగ్‌బి అమితాబ్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే( Kamal Haasan ), దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అలాగే వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా.శాన్ డియాగో కామిక్ కాన్ 2023 వేడుకల్లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి నుంచి సినిమా సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్ ప్రాజెక్ట్ కే లో కే అంటే కల్కి అని అర్థం అని వెల్లడించారు.కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD )’ అంటూ టైటిల్ రివీల్ చేశారు.

  ఇక మూవీ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్‌లా, ఓ డిఫరెంట్ వరల్డ్‌ని క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్( Nag ashwin ).ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విధంగా డార్లింగ్‌ని చూపించబోతున్నారు నాగ్ అశ్విన్.భవిష్యత్తు వర్తమానం మధ్య జరిగే కథగా విష్ణుమూర్తి 11వ అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి రెబల్ స్టార్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, అశ్వినీ దత్, రానా తదితరులు హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా నాగ్, ఫైనల్లీ ఇండియన్ మైథాలజీని ఇక్కడి వరకు తీసుకొచ్చామంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చారు.హాలీవుడ్ వాళ్లకి స్పేస్‌లో దూసుకుపోయే సూపర్ హీరోలంటే ఇష్టం.థోర్, హల్క్ వంటి వారున్నారు.

వారు బిల్డింగ్‌లను మట్టి కరిపిస్తారు.మాకు ఆంజనేయుడున్నాడు.

సూర్యుడిని తింటాడు.పర్వతాలను ఎత్తుతాడు అంటూ కుంభకర్ణుడి గురించి కూడా చెప్పారు.

అలాగే టైటిల్ గ్లింప్స్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు అనడిగితే వీడియో ఆయనతోనే స్టార్ట్ అవుతుంది.ప్రతి చోటా ఆయన ఉన్నారు అంటూ కన్ఫ్యూజన్‌లో పడేశారు.

తాజా వార్తలు