రోజుకు మూడుసార్లు తన రూపాన్ని.. మార్చుకునే అమ్మవారు.. ఎక్కడో తెలుసా..?

ఉత్తరాఖండ్ లోని గార్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయోగ( Srinagar Rudraprayag ) మధ్య అలకనంద నది ఒడ్డున ధారీ దేవి దేవాలయం ఉంది.

ఈ దేవాలయం శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ దేవాలయం కాళీ దేనికి అంకితం చేయబడి ఉంది.అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజూ ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు.

ఇక్కడ ఉన్న ధారీ దేవి ఉత్తరఖండ్( Dhari Devi Temple ) లోని చార్‌ధామ్‌ను రక్షిస్తుందని భక్తులు నమ్ముతారు.అందువల్ల ధారీ దేవి పర్వతాలను యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు.

ధారీ దేవి విగ్రహం పై భాగం ఈ దేవాలయంలో ఉంది.అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత దేవాలయంలో ఉంది.

Advertisement
Mystery Of Dhari Devi A Goddess Who Changes Her Face Thrice A Day,Dhari Devi ,Ut

ఇక్కడ ఆమెనీ కాళీదేవి రూపంగా పూజిస్తారు.ఈ దేవాలయంలో ఉన్న ధారీ దేవి విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుందని భక్తులను నమ్ముతారు.

ధారీ దేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలాగా, మధ్యాహ్నం యువతీ లాగా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది.ధారీ దేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Mystery Of Dhari Devi A Goddess Who Changes Her Face Thrice A Day,dhari Devi ,ut

పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా ధారీ దేవి ఆలయం కొట్టుకుపోయింది.ఈ దేవాలయం తో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది.ఈ విగ్రహం దారో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది.

ఈ విగ్రహం నుంచి ఒక దివ్య రూపం వేలబడిందని, అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని గ్రామస్తులకు సూచించిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.అప్పుడు దారో గ్రామ ప్రజలంతా కలిసి అక్కడ ధారీ దేవి దేవాలయాన్ని నిర్మించారు.

Mystery Of Dhari Devi A Goddess Who Changes Her Face Thrice A Day,dhari Devi ,ut
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ముఖ్యంగా చెప్పాలంటే ధారీ దేవి దేవాలయాన్ని 2013 వ సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించారని చెబుతారు.దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరఖండ్( Uttarakhand ) లో భయంకరమైన వరదలు సంభవించినప్పుడు వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.జూన్ 16 2013 సాయంత్రం ధారీ దేవి విగ్రహాన్ని తొలగించిన కొన్ని గంటల తర్వాత వరద రాష్ట్రాన్ని తాకిందని ప్రజలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు