ఆ ఆల‌యంలో ఎవ‌రైనా రాత్రివేళ నిద్రిస్తే ఉద‌యానిక‌ల్లా...

భారతదేశంలో రాత్రిపూట బస చేయడంపై నిషేధం ఉన్న అనేక ఆల‌యాలు ఉన్నాయి.భారతదేశంలోని రాజస్థాన్‌లో కూడా అలాంటి ప్రదేశం ఉంది.

రాజస్థాన్‌లోని బార్మెడ్‌లో ఉన్న కిరాడు ఆలయంలో భ‌క్తులు రాత్రిపూట బస చేయడంపై నిషేధం ఉంది.ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు రాయిగా మారిపోతార‌ని స్థానికులు చెబుతుంటారు.

ఈ ఆలయం ఒక ఋషిచే శపించబడిందని స్థానికులు భ‌విస్తారు.దీని కారణంగా ఈ ఆలయంలో రాత్రిపూట నివసించే వారు రాతిగా మారతారని అంటారు.

శతాబ్దాల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి కిరాడు ఆలయానికి వచ్చాడని కొన్ని క‌థ‌లు చెబుతున్నాయి.ఆ మ‌హ‌ర్షి అత‌ని శిష్యులను గ్రామస్తులపై నమ్మకంతో ఇక్క‌డ‌ వదిలి తపస్సు కోసం వెళ్లార‌ట‌.

Advertisement

గ్రామస్తులు తనను ఎలా చూసుకుంటారో, తన శిష్యులను కూడా అలాగే చూసుకుంటారని ఆ మ‌హ‌ర్షి భావించాడు.అయితే మ‌మ‌ర్షి లేకపోవడంతో శిష్యుల ఆరోగ్యం క్షీణించింది.

గ్రామస్థులెవరూ వారికి సహాయం చేయలేదు. ఋషి తపస్సు నుంచి తిరిగి వచ్చి.

శిష్యుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు.ప్రజలు త‌మ‌కు సహాయం చేయలేదని శిష్యులు చెప్పగా, దానిపై మ‌హ‌ర్షికి కోపం వ‌చ్చింది.

ఇక్కడి ప్రజలు రాతి హృదయులని, వారు మనుషులుగా ఉండటానికి తగినవారు కాదని, వారంతా రాళ్లుగా మారిపోతార‌ని శపించార‌ట‌.దీంతో ఆ ఊరి ప్రజలంతా రాళ్లుగా మారార‌ట‌.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

అయితే ఒక మ‌హిళ ఆ స‌న్యాసుల‌కు సాయం చేసింది.దీంతో మ‌హ‌ర్షి.

Advertisement

మ‌హిళ‌ను గ్రామం విడిచి ఎక్కడికైనా వెళ్ళమని కోరాట‌.అలాగు ఊరు విడిచి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాడట‌.

అయితే ఆ మహిళ వెనక్కి తిరిగి చూసింది.దీంతో ఆమె కూడా రాయిగా మారింద‌ట‌.

నేటికీ ఆ స్త్రీకి సంబంధించిన రాతి విగ్రహం కిరాడు ఆలయానికి కొంత దూరంలో ఉన్న సిహాని గ్రామంలో క‌నిపిస్తుంది.కిరాడు ఆలయం ఇలాంటి కథలకు ప్రసిద్ధి చెందిన‌దైన‌ప్ప‌టికీ, ఈ ఆలయ కళాకృతి శతాబ్దాల నాటిది.కిరాడు అనేది శివుని ఆలయం.11వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇప్పటికీ ఇక్కడ క‌నిపిస్తాయి.కిరాడు ఆలయాన్ని మినీ ఖజురహో అని కూడా అంటారు.

తాజా వార్తలు