నమ్మండి ప్లీజ్ : జగన్ నన్ను కొట్టలేదు..!

వైసిపి ఎమ్మెల్యే ఒకరిని ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కొట్టారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అయితే ఎవరు ఆ ఎమ్మెల్యే ?   జగన్ కొట్టడానికి కారణం ఏమిటి ? అసలు ఏమైంది అనే దానిపై నిన్నటి నుంచి ఒక రకమైన చర్చ రాజకీయాల్లో జరుగుతోంది.

కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల జగన్ తో నిర్వహించిన ఓ సమావేశానికి వెళ్లారని, ఆ సమావేశం అనంతరం బయటకు వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కళ్ళజోడు విరిగిపోయిందని,  దీనికి కారణం జగన్ వసంత కృష్ణ ప్రసాద్ పై చేయి చేసుకోవడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే జగన్ తనను కొట్టలేదని, ఇదంతా టిడిపి సోషల్ మీడియా ద్వారా కుట్ర పన్ని , తనను అభాసుపాలు చేస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ చెబుతున్నారు.  తనను రాజకీయంగా అభాసుపాలు చేసేందుకు తన ప్రత్యర్థులు ఈ విధంగా కుట్ర చేసి , రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని కృష్ణప్రసాద్ చెబుతున్నప్పటికీ ఆయనకు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది .అసలు ఈ ప్రచారం మొదలు కాగానే మీడియా సమావేశం నిర్వహించి ఖండించాలి అని వసంత కృష్ణ ప్రసాద్ భావించినా, అలా చేస్తే నిజంగానే జగన్ కొట్టారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుతుందని భావించిన ఆయన, ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ తనపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని,  దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.   

Mylavaram Ycp Mla Vasantha Krishna Prasad Has Denied Reports That Jagan Had Beat

 ఈ వ్యవహారంలో ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకుడు హస్తం ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరారు.జగన్ కు తనకు మధ్య విభేదాలు ఏమీ లేవని, కుట్రపూరితంగానే ఈ  వ్యవహారమంతా తన రాజకీయ ప్రత్యర్ధి నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.ఇక కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు .ఈ మేరకు ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకుడు పట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.కాకపోతే ఈ విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ కు చాలానే డ్యామేజ్ జరిగింది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోకి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
Mylavaram Ycp Mla Vasantha Krishna Prasad Has Denied Reports That Jagan Had Beat
" autoplay>

తాజా వార్తలు