సచిన్ లాంటి క్రికెటర్ మళ్లీ పుట్టడు.. సచిన్ ను ప్రశంసలతో ముంచెత్తిన మురళీధరన్?

క్రికెట్ ప్రేమికులకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్( Cricketer Sachin Tendulkar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కేవలం క్రికెట్ ను వీక్షించే వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి సచిన్ సుపరిచితమే.

అయితే తాజాగా సచిన్ ని ప్రశంసలతో ముంచెత్తారు మురళీధరన్.ఆ వివరాల్లోకి వెళితే.

టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్( Muttiah Muralitharan ) జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా 800.మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి వహించారు.

అలాగే ఈ మూవీకి బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.

Advertisement

శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ముంబైలో మంగళవారం 800 ట్రైలర్ లాంచ్( 800 Movie Trailer ) ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్‌కి థాంక్స్.నేను కూడా సచిన్ అభిమానిని.

క్రికెట్‌లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు.మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు.

ఆయన ఎప్పటికీ బెస్ట్ అంతే.మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

నా బౌలింగ్‌లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు.కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు.

Advertisement

రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు అంటూ సచిన్ ని ప్రశంసలతో ముంచెత్తారు మురళీధరన్.ఈ సందర్భంగా మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అనంతరం సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ.

మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్.అతని జీవితంలో( Muttiah Muralitharan Biography ) ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి.

ఎంతో సాధించినా చాలా సింపుల్‌గా ఉంటాడు.అతనికి నో చెప్పడం కష్టం.

అతని కోసమే నేను ఇక్కడికి వచ్చాను.ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి.

కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం.అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం.

మురళీధరన్ కూడా అదే చేశారు అని తెలిపారు.

తాజా వార్తలు