గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ పేరు గట్టిగానే వినబడుతోంది.విషయం అందరికీ తెలిసినదే.
మస్క్ ట్విట్టర్ కొన్న తర్వాత కొన్ని కీలక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హాట్ టాపిక్ అయ్యాడు.ఇప్పటి వరకూ ఈ కంపెనీలో చాలా కీలక పదవిలో రాణిస్తున్న ముగ్గురు అధికారులను మస్క్ నిర్దాక్షిణ్యంగా తీసిపడేసాడు.
వీరిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, రెండవది లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె, ఇక మూడవది CFO నెడ్ సెగల్ ను మస్క్ విధులనుండి తొలగించారు.విషయం అందరికీ తెలిసినదే.
గతంలో ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో వెనక్కి తగ్గిన మస్క్ ను.వారు కోర్టుకు లాగడంలో ముఖ్యభూమిక పోషించారు.దీంతో మస్క్ వీరిని కావాలనే విధులనుండి తప్పించారు.
అయితే ఈ అనూహ్య చర్యకు గాను ఈ ముగ్గురు మస్క్ తో న్యాయ పోరాటం చేయనున్నారు.ఈ విషయమై వీరు మస్క్ నుండి దాదాపు $100 మిలియన్లకు పైగా వసూలు చేయడానికి మేప్ సిద్ధం చేసారు.
ఏరకంగా అంటే, పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లోకి ఉద్యోగంలో చేరే సమయంలో సంవత్సరం లోపు ఉద్యోగం నుంచి అనూహ్యకారణాలవలన తొలగిస్తే $50మిలియన్ డాలర్లు చెల్లించాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఆ వరుసలోనే పరాగ్ కు 42 మిలియన్ డాలర్లు, CFO నెడ్ సెగల్ సుమారు $35మిలియన్లు, మరియు విజయ గద్దెకు $15 మిలియన్లకు ట్విట్టర్ అంటే ఇపుడు మస్క్ చెల్లించాల్సి ఉంటుంది.కంపెనీ నిబంధనల ప్రకారం Twitter కొనుగోలు తర్వాత వారు తమ ఉద్యోగాలను కోల్పోయినా, అన్‌వెస్టెడ్ ఈక్విటీ అవార్డుల క్యాష్-అవుట్‌లను పొందే వీలుంది.కాగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.
ట్విటర్ షేర్ల ట్రేడింగ్‌ను శుక్రవారం నుంచి రద్దు చేస్తారని వినికిడి.ఈ అంశాలన్నీ మస్క్ ని ముంచేయడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy