వైరల్: చిన్నారి ముద్దు ముద్దు మాటలకు లిరిక్స్‌, మ్యూజిక్‌ కంపోజ్ చేసారు... అద్భుతమైన వీడియో!

సోషల్‌ మీడియాలో( Social Media ) నిత్యం కొన్ని లక్షల వీడియోలు పోస్ట్‌ చేయబడుతూ ఉంటాయి.అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక వైరల్ అయిన వాటిలో వేళ్ళమీద లెక్కపెట్టినట్టు కొన్ని అత్యధిక ప్రాచుర్యం పొందుతాయి.కారణం ఆ కంటెంట్ కి వున్న ప్రత్యేకత అని చెప్పుకోక తప్పదు.

ముఖ్యంగా మనసుకి ఆహ్లాదంగా అనిపించే వీడియోలు జనాలు బాగా ఆదరిస్తారు.ఇలాంటి వీడియోలను ఎక్కువమంది ఫార్వార్డ్‌ చేయకుండా ఉండలేరు.

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఆ మధ్య ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో ఎంజాయ్‌ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ( Parents ) రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది.కాగా ఆ వీడియోకు మ్యూజిక్‌ ( Music ) జత చేస్తే ఎలా ఉంటుందో అని కొంతమంది సంగీత కళాకారులకు ఓ ఐడియా వచ్చింది.అనుకున్నదే తడవుగా తమ పనితనాన్ని చూపించారు .దాంతో ఆ చిన్నారి నత్తి సరిగమలు అందమైన ఓ పాటలాగా తయారయ్యాయి.కాగా దీనికి సంబందించిన వీడియో ఇపుడు నెటిజనాలను తెగ కితకితలు పెడుతోంది.

ఇక మీరు ఈ వీడియో చూశారంటే తప్పకుండా రెండు పనులు చేస్తారు.ఒకటి ఇతరులకు షేర్ చేయడం, రెండవది దాన్ని సేవ్ చేసుకొని మీ చిన్నారులకు మరలా మరలా చూపించడం.అవును, ఆ వీడియో అంతలా కవ్విస్తోంది, నవ్విస్తోంది.

సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన 3 నెలల తరువాత వారి ప్రతిభ అనేది బయటపడుతూ ఉంటుంది.వాళ్లను బాగా అబ్జర్వ్‌ చేయాలేగాని అనేక విషయాలు మనకు బోధపడతాయి.

వాళ్లకు తెలియకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు.పాటలు పాడుతుంటారు.డైలాగులు చెబుతుంటారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

ఇక బుజ్జిబుజ్జిగా వీళ్లు చేసే పనులను కెమెరాలో బంధించి చూసుకుంటే ఆ ఆనందమే వేరు కదా అనుకుంటే ఇపుడు దానికి నెక్స్ట్ లెవల్ వీడియో వచ్చింది.

Advertisement

తాజా వార్తలు