థమన్ కూడా తిక్క చూపిస్తున్నాడు..!

శంకర్ బాయ్స్ సినిమాలో తళక్కున మెరిసిన థమన్ ఆ తర్వాత మ్యూజిక్ డైరక్టర్ గా ఫుల్ ఫాం సంపాదించాడు.

కుదిరితే దేవి లేదంటే థమన్ అన్న తీరున తెలుగు తమిళ భాషల్లో అతి తక్కువ టైంలోనే థమన్ 50 పైగా సినిమాలకు సంగీతం అందించాడు.

ఇక మ్యూజిక్ డైరక్టర్ గా టర్న్ తీసుకున్న తర్వాత థమన్ ఆన్ స్క్రీన్ మీద కనిపించింది లేదు.కాని మరోసారి తన టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడట.

ఇంతకీ థమన్ నటించేది ఎవరి సినిమాలో అంటే సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తిక్క సినిమాలో.సునీల్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సినిమాలో ఓ సర్ ప్రైజ్ రోల్ లో థమన్ దర్శనమిస్తున్నాడట.బాయ్స్ తర్వాత థమన్ కెమెరా ముందుకు వచ్చిన సినిమా ఇదే.కిక్ తో మ్యూజిక్ డైరక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన థమన్ సినిమా సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ శ్రోతలను అలరిస్తున్నాడు.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు కేక పెట్టించే మ్యూజిక్ ఇస్తున్న థమన్ ఇప్పుడు మళ్లీ యాక్టింగ్ పై గాలి మళ్లడం గురించి అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే కేవలం దర్శకుడు సునీల్ రెడ్డి, సాయి ధరం తేజ్ బలవంతం మీదే ఈ రోల్ చేస్తున్నట్టు థమన్ సన్నిహితులతో అంటున్నాడట.

ఇంద్ర సినిమాలో సుద్దాల పాటను తీసేయడానికి కారణం ఏంటంటే..!?
Advertisement

తాజా వార్తలు