టాలీవుడ్ ఇండస్ట్రీలో ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే?

గత కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాలలో భూముల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.20 సంవత్సరాల క్రితం 10,000 రూపాయల విలువ చేసిన భూములు ప్రస్తుతం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి.

ఎవరైతే భూములపై ఇన్వెస్ట్ చేశారో వాళ్లు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు.ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను వ్యాపారవేత్తను కాబట్టి సినిమాలు చేస్తున్నా కూడా వ్యాపారాలు కూడా చెస్తూ ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

నాకు నచ్చిన సినిమాల హక్కులను కొనుగోలు చేసేవాడినని ఆయన తెలిపారు.రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలలో కూడా నేనుస్ షేర్ హోల్డర్ గా ఉన్నానని మురళీ మోహన్ వెల్లడించారు.

హైదరాబాద్ లో ఒకటి, విజయవాడలో ఒకటి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు ఉన్నాయని మురళీ మోహన్ పేర్కొన్నారు.శోభన్ బాబు గారు ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

Advertisement

ల్యాండ్ అనేది ఎంతుందో అంతే ఉంటుందని మురళీ మోహన్ పేర్కొన్నారు.జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని జనాభా పెరిగిన స్థాయిలో ల్యాండ్ పెరగదని మురళీ మోహన్ అన్నారు.రాబోయే రోజుల్లో పెరిగిపోయిన జనాభాకు ల్యాండ్ అంతే ఉంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుందని ఆయన ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేశారని ఆయన స్పూర్తితో నేను కూడా ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల్యాండ్స్ పై ఎక్కువగా ఇన్వెస్ చేశారని ఆ ల్యాండ్స్ వాల్యూ భారీగా పెరగడంతో వాళ్లు సంతోషంగా ఉన్నారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చని మురళీ మోహన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు