Murali Mohan ANR: నాకు అలవాటు చేసుకొమ్మని అక్కినేని గారు చెప్పేవారు : మురళి మోహన్

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఖరీదైన జీవితం.అనవసరపు పోకడలు.

చేతిలో డబ్బు ఉన్నా, లేకపోయినా కూడా ఎంతో చూపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి.

అలాగే ఎప్పుడు సోషల్ మీటింగ్స్ కూడా జరగడం చాలా కామన్.

ఇలా అందరు కలిసి కూర్చున్నప్పుడు మందు తీసుకోవడం అలాగే స్మోక్ చేయడం కూడా సర్వ సాధారణం.సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన వారు ఎవరైనా సరే ఇలాంటి అన్ని లక్షణాలు కలిగి ఉంటారు ఒకవేళ లేకపోతే అలవాటు చేస్తారు.

కానీ ఒక్క మురళి మోహన్( Murali Mohan ) మాత్రమే సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ముందే కొన్ని నియమ నిబంధలను పెట్టుకున్నారు.

Murali Mohan About Akkineni Nageswara Rao
Advertisement
Murali Mohan About Akkineni Nageswara Rao-Murali Mohan ANR: నాకు అల

ఎంత పెద్ద నటుడిని అయినా సరే మందు, సిగరెట్ అలాగే అమ్మాయిల జోలికి అస్సలు పోకూడదు అని నిర్ణయించుకున్నారు.అనుకున్నట్టే చాల ఏళ్ళ పాటు అయన ఎలాంటి చెడు అలవాట్లు కానీ, చెడు సావాసాలు కానీ చేయలేదు.కానీ కొన్నేళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వర రావు గారు( Akkineni Nageswara Rao ) మురళి మోహన్ ని రాత్రి పూట మీరు ఏం బ్రాండ్ తీసుకుంటావ్ అని అడిగారట.

అందుకు నేను కేవలం భోజనం చేసి పడుకుంటాను అండి అంటూ వినయంగా సమాధానం చెప్పారట.అందుకు అక్కినేని మనకు 60 ఏళ్ళ వయసు వచ్చాక నరాలు సరిగ్గా యాక్టివ్ గా ఉండక పని చేయవు.

అందుకుని రోజు ఒక పెగ్ తీసుకుంటే బాడి మన మాట వింటుంది అని సలహా చెప్పారట.

Murali Mohan About Akkineni Nageswara Rao

సరే ఇంత పెద్దాయన ఒక సలహా ఇస్తున్నారు కదా అని ఒక వారం పది రోజులు రోజుకి కొంచం తాగడం ( Drinking ) అలవాటు చేసుకున్నారట కానీ ఆ తర్వాత తన వల్ల కాలేదట.అయితే ఇప్పుడు మాత్రం అకేషనల్ గా ఎప్పుడో ఒక పెగ్ తీసుకుంటున్న అని, అందువల్ల పెద్ద ఉపయోగం ఉంటుందో లేదో కానీ ఆరోగ్యం మాత్రం బాగుంది అని చెప్పారు.ప్రస్తుతం నాకు 83 ఏళ్ళు అని, అయినా కూడా చాల ఆరోగ్యంగా ఉన్నానని, ఇక ముందు కూడా ఇలాగె ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను అంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నటుడు , నిర్మాత అయినా మురళి మోహన్ తెలిపారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అయన శేష జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు