మునుగోడు అంద‌రికీ ప్ర‌తిష్టాత్మ‌క‌మే... ద‌క్షిణ తెలంగాణ‌లో స‌వాలే..

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది.ప్ర‌ధాన పార్టీలు స‌మాయ‌త్తం అవుతున్న నేప‌థ్యంలో కీల‌కంగా మార‌నుంది.

అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌నున్నాయి.త్వ‌ర‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ ఎన్నిక ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి.శాసన సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖ‌య‌మ‌నే విష‌యం తెలిసిందే.

ఇక ఈ ఎన్నిక లో గెలిచి ప్ర‌జాభిమానం త‌మ‌కే ఉంద‌ని టీఆర్ఎస్ చెప్పుకోవాల‌ని చూస్తోంది.ఇటు కాంగ్రెస్ కంచుకోట‌ను ప‌దిలంగా ఉంచుకోవాల‌ని ఫిక్స్ అయింది.

Advertisement

ఇక బీజేపీ తెలంగాణాలో పాగా వేయాల‌ని చూస్తోంది.తో హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, హుజూరాబాద్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి.జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కూ ఎన్నికలు జరిగాయి.

నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఒక ఎత్తు.ఇప్పడు ఎన్నికలు జరుగనున్న మునుగోడు ఒక ఎత్తు.

అన్నిటికి మించి హైదరాబాద్ కార్పొరేషన్ దుబ్బాక, హుజూరాబాద్ నియోజక వర్గాలు పూర్తిగా ఉత్తర తెలంగాణలో ఉన్నవి.మునుగోడు మాత్రం దక్షిణ తెలంగాణ పరిధిలోకి వ‌స్తుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అయితే ఉత్తర తెలంగాణలో ఉద్యమ భావజాలంతో టీఆర్ఎస్ ఇతర కారణాలతో బీజేపీ బలంగా ఉన్నాయి.కాంగ్రెస్ కూ పట్టుంది.

Advertisement

ఇక్క‌డ బ‌లంగా ఆ పార్టీయే.

అయితే దక్షిణ తెలంగాణకు వచ్చేటప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ దే ఆధిపత్యం.సంస్థాగతంగా పార్టీ పునాదులు న‌ల్ల‌గొండ జిల్లాల్లో బలంగా ఉన్నాయి.నాయకులు కూడా బలమైనవారు ఉన్నారు.

అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి నల్లగొండ జిల్లా కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అలాగే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు బలమైన నాయకులుగా ఉన్నారు.వీరికితోడు వామపక్ష పార్టీలు దక్షిణ తెలంగాణలో ఇంకా ప్రభావవంతంగా ఉండేవి.

ముఖ్యంగా నల్లగొండ ఖమ్మం జిల్ల్లాల్లో వామపక్షాల పాత్ర చాలా కీలకం.ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలో మునుగోడు ప్రత్యేకంగా నిలవనుంది.

మునుగోడులో దశాబ్దాలుగా కాంగ్రెస్ కు కంచుకోట‌.సంస్థాగతంగానూ ఆ పార్టీకి పట్టుంది.

ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ గ‌నుక త‌న బలాలను ఉపయోగించి గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది.అయితే బీజేపీకే పెద్ద సవాల్ గా మార‌నుంది.

ఎందుకంటే ఇక్క‌డ బీజేపీకి పెద్ద‌గా క్యాడ‌ర్ లేదు.బ‌ల‌మైన నాయ‌కులూ లేక‌పోవ‌డం కొంత మైన‌స్.

మ‌రి మునుగోడు ఉప ఎన్నిక దక్షిణ తెలంగాణలో బీజేపీకి ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.