మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ రానే వచ్చింది.

ఉపఎన్నికకు ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది.

నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు.అదేవిధంగా నవంబర్ 6న ఎన్నిక కౌంటింగ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

నామినేషన్ దాఖలకు ఈనెల 14 వరకు సమయం ఉండగా.ఈ నెల 17 వరకు నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.

ఈ మేరకు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.అయితే మునుగోడు ఉప ఎన్నిక హరిలో మూడు ప్రధాన పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

నామినేషన్ ప్రక్రియ నుండి పోలింగ్ వరకు అతి కొద్ది సమయం మాత్రమే ప్రచారానికి ఉంది.ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని పార్టీ అధిష్టానం ప్రకటించగా.

బిజెపి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.అదేవిధంగా మునుగోడు బరిలో బి ఆర్ ఎస్ గా పోటీకి దిగుతామన్న కేసీఆర్.

అభ్యర్థి ప్రకటన చేయలేదు.ఉప ఎన్నికకు షెడ్యూల్ కూడా రావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement