మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పడుతున్నాయి.
ఓటరు నాడి ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది అనేది తెలుసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్ లు అన్నీ తెలుసుకుంటూ దానికి అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు అనేక హామీలు ఇస్తూ అన్ని పార్టీలు ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఎవరికి వారు తమదే గెలుపు అంటూ ధీమాను వ్యక్తం చేస్తూ.
ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అని ఓ సర్వే సంస్థ సర్వే వివరాలు బయటకు వచ్చాయి.
అయితే ఆ సర్వే రిపోర్ట్ చూసి మూడు ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నాయి.రెండు ప్రధాన పార్టీల మధ్య గెలుపు ఓటమి వ్యత్యాసం 4.5% గా ఉందని సర్వే రిపోర్ట్ బయటకు రావడం మరింత టెన్షన్ పుట్టిస్తుంది.రెండు ప్రధాన పార్టీల మధ్య ఓటు షేరింగ్ కేవలం 6% అని ఓ సర్వే సంస్థ తమ నివేదికను బయటపెట్టింది.
ఇక యువత ఎక్కువగా ఓ ప్రధాన జాతీయ పార్టీ అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలిందట.అలాగే 45 ఏళ్ల వయసు పైబడిన వారు స్థానిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారంటూ వీరిపైనే అధికార పార్టీ టిఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది.
వీటితో పాటు మునుగోడులో మహిళల ఓట్లు కీలకంగా మారబోతుంది.కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తూ ఉండడం తో ఆమెకు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఓ సర్వీస్ సంస్థ వివరాలను బయటపెట్టింది.
అలాగే వామపక్ష పార్టీలు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తుండడంతో, ఆ పార్టీకి గెలుపు పై ధీమా గా ఉంది.ఇక కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వివాదం మొదలైనప్పటి నుంచి వారికి మద్దతుగా ఉన్న ఓటు బ్యాంకు పైన స్పష్టమైన ప్రభావం ఉండబోతున్నట్లు మరో సర్వే సంస్థ వెల్లడించింది.అయితే కేంద్ర అధికార పార్టీ బిజెపి మూడో స్థానంలో ఉంది అంటూ టిఆర్ఎస్ కాంగ్రెస్ లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసే పనిలో నిమగ్నం అయ్యాయి. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy