తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్( Delhi Capitals-Mumbai Indians ) మధ్య జరిగిన మ్యాచ్ లో ఎవరు తొలి విజయం సొంతం చేసుకుంటారనే క్రమంలో చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగి చివరకు ముంబై ఇండియన్స్ గెలుపు సాధించింది.ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుని లీగ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ 172 పరుగులకు ఆల్ అవుట్ అయింది.173 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ముంబై ఇండియన్స్ మంచి శుభారంభం కొనసాగించి మొదటి వికెట్ కు 71 పరుగులు చేసింది.రోహిత్ శర్మ( Rohit Sharma ) 45 బంతుల్లో 65 పరుగులు, చాన్ కిషన్( Chan Kishan ) 26 బంతుల్లో 31 పరుగులు చేశారు.
ఇషాన్ కిషన్ రన్ అవుట్ తో ముంబై ఇండియన్స్ మొదటి వికెట్ కోల్పోయింది.
తర్వాత క్రీజు లోకి వచ్చిన తిలక్ వర్మ( Tilak Verma ) తో కలిసి రోహిత్ శర్మ అద్భుత ఆట ప్రదర్శన చేసి రెండో వికెట్ కు 51 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.తిలక్ వర్మ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ముఖేష్ కుమార్( Mukesh Kumar ) బంతిలో అవుట్ అయ్యాడు.ఆ తర్వాత ఓవర్లో రోహిత్ శర్మ అవుట్ అవడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ రన్ రేట్ పెరుగుతూ పోయింది.ఈ క్రమంలో 12 బంతుల్లో ముంబై ఇండియన్స్ 20 పరుగులు చేయాల్సి ఉంది.19 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్లో టిమ్ డేవిడ్, కామెరున్ గ్రీన్ లు చెరొక సిక్స్ తో చెలరేగి 15 పరుగులు చేశారు.దీంతో ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి ఉంది.
చివరి బంతిలో టిమ్ డేవిడ్( Tim David ) రెండు పరుగులు చేయడంతో ముంబై జట్టు తొలి విజయం సాధించింది.అయితే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడిపోవడం లేదంటే డ్రా అవుతుందని అనుకున్నారు.19వ ఓవర్లో ఆటలో కీలక మార్పు చోటు చేసుకోవడంతో విజయం ముంబై ఇండియన్స్ ఖాతాలో పడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy