చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్

టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేత పయ్యావుల కూడా ములాఖత్ అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ఈ ములాఖత్ లో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు చంద్రబాబు పిటిషన్లపై విచారణ వ్యవహారాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement