అందరూ వద్దన్నా పట్టించుకోలే.. సిరివెన్నెల రెమ్యునరేషన్ పెంచాను ప్రముఖ నిర్మాత..

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల మరణం తర్వాత ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు పంచుకుంటున్నారు.తెలుగు సినిమా ప్రముఖులు ఆయనతో సాన్నిహిత్యం గురించి చర్చించుకుంటున్నారు.

ఆయన మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించాడు ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు.

శాస్త్రి మరణంతో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుందని అన్నాడు.నిజానికి తామిద్దరం రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్లం అని చెప్పాడు.

సుమంత్ ఆర్ట్స్ సంస్థ స్థాపించక ముందు అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తాను నిర్మాతగా మనవడొస్తున్నాడు సినిమా తీసినట్లు చెప్పాడు.అందులో సిరివెన్నెల పాటలు రాశారు.

Advertisement
Ms Raju About Sirivennela Remuneration , Ms Raju , Sirivennela , Arjun, Sumant A

అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది.చెరుకు చేను చాటు ఉంటే అనే పాట రాయడం ఇప్పటికీ గుర్తుంది అన్నాడు.

అటు తన సంస్థ మొదలయ్యాక శత్రువు సినిమాలో పొద్దున్నే పుట్టిందీ చందమామ అనే పాట కూడా సిరివెన్నెలే రాసినట్లు చెప్పాడు.ఆ తర్వాత మనసంతా నువ్వేకు కూడా తనతోనే పాటలు రాయించినట్లు చెప్పాడు.ఆయన రాసిన అన్ని పాటలు అద్భుతం అన్నాడు.

ఆయనతో కలిసి పాటల గురించి మాట్లాడుతుంటే మనసు ఫీనిక్స్ పక్షిలా ఎగిరేదని చెప్పాడు.కథకు తగ్గట్లుగా తను ఎన్నిసార్లు మార్చి రాయమన్నా రాసేవాడని చెప్పాడు.

Ms Raju About Sirivennela Remuneration , Ms Raju , Sirivennela , Arjun, Sumant A

సిరివెన్నెల తన సినిమాలకు రాసిన ప్రతి పాట ఒక అద్భుతం అని చెప్పాడు. అప్పట్లో తనకు రెమ్యునరేషన్ తక్కువగా ఉండేదని చెప్పాడు.ఆయన సాహిత్యానికి అంత తక్కువ విలువ ఉండ కూడదు అనే రెమ్యునరేషన్ పెంచినట్లు చెప్పాడు.చాలా మంది అనవసరంగా పెంచుతున్నావు అని చెప్పినా.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాను పట్టించుకోలేదని వెల్లడించాడు.పాటలను రాసేవారిని గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Advertisement

శాస్త్రి తన ద్రుష్టిలో చాలా ఉన్నతమైన వ్యక్తి అన్నాడు.అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారని వెల్లడించాడు.

ఆయన మన మధ్యలేకపోవడం చాలా పెద్దలోటు అని చెప్పాడు.ఆయన చివరి క్షణంలో దగ్గర లేనందుకు బాధపడుతున్నట్లు రాజు వెల్లడించాడు.

తాజా వార్తలు