భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని( Mahendra Singh Dhoni ) తన గారాల బట్టి జీవా( jeeva ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చాలా ఓపెన్ గా మాట్లాడాడు.
వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాలను పూసగుచ్చినట్టు చెప్పాడు.ఈ సందర్భంగా తన కూతురు జీవా గురించి చెబుతూ ఎవరైనా నువ్వు మీ నాన్నని ఎందుకు ప్రేమిస్తున్నావు అని ఆమెని అడిగితే చాలా ఓపెన్ గా మా నాన్న అంటే డబ్బు కాబట్టి అంటుందట.
తను ఎందుకు అలా నేర్చుకుందో తెలీదు అలాగే తను ఎవరి దగ్గర ఆ మాట నేర్చుకుందో తెలియదు.కానీ తను నన్ను డబ్బు అనుకుంటుంది.
అలాగే నేను డబ్బులు ఇచ్చే వ్యక్తిని అనుకుంటుంది.అందుకే తన నన్ను ప్రేమిస్తుంది.
కేవలం నా కూతురు మాత్రమే కాదు ఇప్పుడు జనరేషన్ పిల్లలు అందరూ అలాగే ఉన్నారు.కానీ నా చిన్నతనం అలా జరగలేదు.మా నాన్న పక్క రూమ్ లో ఉంటే నేను ఇంకో రూమ్ లో ఉండేవాడిని.
ఆయన ఇంట్లో ఉన్నాడంటే నేను చాలా సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడే వాడిని.రాను రాను ఆ కల్చర్ పోయి ఇప్పుడు డబ్బు కల్చర్( Money culture ) వచ్చింది.
ఇంకా కొన్ని రోజులు ఆగితే జీవితం ఎటు వెళుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము.అందుకే మీ పిల్లలకు డబ్బు గురించి కాకుండా ప్రేమ గురించి తెలియజేయండి.
ఇక భవిష్యత్తులో పిల్లల విషయానికొస్తే నాన్న కలిసి మందు తాగుదాం రండి అంటూ ఇన్వైట్ చేస్తారు.
అందుకే నేను మందు తాగడం మానేస్తున్నాను.ఒకవేళ నా కూతురు తాగాలనుకుంటే ఆమెని బీర్ తాగమని చెప్పి నేను సోడా తాగుతాను అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.ఈ మాటలు విన్న తర్వాత అసలు పెద్ద వాళ్ల కుటుంబాల్లో ఏం జరుగుతుంది అనే అనుమానం చాలా మందికి వచ్చింది.
అలాగే ధోని కుటుంబంపై కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు.ధోని భార్య జీవాని సరిగా పెంచలేదు అన్నవారు కూడా ఉన్నారు.ఏదేమైనా నిజంగానే ధోని చెప్పిన మాటలతో కొంతమంది ఒప్పుకున్నారు.
ఇప్పటి జనరేషన్ పిల్లలు పూర్తిగా పాడైపోయారు అనేది నిజమే కదా.ధోనీ ఇంటర్వ్యు వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా తమ పిల్లల పట్ల తమ స్వభావాన్ని మార్చుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy