ఎమ్మార్వో విజయారెడ్డి హంతకుడు సురేష్‌ మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మారో విజయారెడ్డిపై ఈనెల 4వ తేదీన పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి, ఆ తర్వాత తాను కూడా నిప్పు అంటించుకున్న సురేష్‌ ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.60 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయిన సురేష్‌ను వైధ్యులు బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

కాని అతడి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు.

ప్రాణాలు కోల్పోవడానికి ముందే విజయా రెడ్డిని చంపిన విషయమై పోలీసులకు సురేష్‌ వాంగ్మూలం ఇచ్చాడు.తన భూమి విషయమై ఎమ్మార్వో విజయా రెడ్డిని పలు సార్లు కలిశాను అని, 4వ తారీకు ఉదయం కూడా కలిసి ఆమెకు విజ్ఞప్తి చేశాను.

కాని కోర్టు పరిధిలో ఉండి, జాయింట్‌ కలెక్టర్‌ గారు చూస్తున్న విషయం అని, అందుకే తాను ఏం చేయలేను అంటూ చెప్పారు.ఆ సమయంలో ఆమెను ఎంత బతిమిలాడినా కూడా ఆమె స్పందించక పోవడంతో కోపంతో పెట్రోలు పోసి నిప్పు అంటించాను.

నేను కూడా ఆత్మహుతి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ పని చేసినట్లుగా చెప్పాడు.సురేష్‌ మరణించడంతో విజయారెడ్డి హత్యకేసు క్లోజ్‌ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

తాజా వార్తలు