వచ్చే ఎన్నికలలో అభ్యర్థిని చూసుకోండి ఎంపీ రఘురామకృష్ణ రాజు సవాల్..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి నేపధ్యంలో తన నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది.

దీంతో భారీ ఎత్తున స్థానిక నాయకులు స్వాగతం పలికారు.హైకోర్టు పర్మిషన్ తో భద్రత మధ్య రఘురామకృష్ణ రాజు పర్యటన సాగుతోంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో పోటీకి సంబంధించి తనపై వైసీపీ సోషల్ మీడియా( YCP Social Media ) విభాగం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.తనకి తెలుగుదేశం జనసేన పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదని.

చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా( West Godavari District )లో తన పర్యటనలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కలిసినట్లు తెలిపారు.వైసీపీని ఓడించడానికి అన్ని చోట్ల కలిసికట్టుగా నాయకులు పనిచేస్తున్నారు.నాకు టికెట్ కేటాయించడం లేదని పిల్ల సజ్జల సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు.

ఇలాంటి పిచ్చ ప్రచారాలు చేయొద్దు.తెలుగుదేశం జనసేన అందరూ కలిసి పని చేస్తున్నారు.వచ్చే ఎన్నికలలో ముందు నా మీద పోటీ చేసేందుకు కాండేట్ నీ చూసుకోండి అంటూ రఘురామకృష్ణ రాజు సవాల్ విసిరారు.2019 ఎన్నికలలో నరసాపురం ఎంపీగా వైసీపీ( YCP ) నుండి పోటీ చేసి గెలవడం జరిగింది.అయితే కొన్నాళ్లకే ఆ పార్టీ అధిష్టానంతో విభేదాలు రావటం తెలిసిందే.

దీంతో 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణ రాజు పోటీ చేయనున్నట్లు సమాచారం.

బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి కారణం ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు