కాంగ్రెస్ కు రాజీనామా ప్రచారంపై ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న ప్రచారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు.

కొందరు కావాలనే ఉద్దేశ పూర్వకంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పార్టీ మారే ఆలోచన లేదని కోమటిరెడ్డి తెలిపారు.ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనప్పుడే మారేవాడినని వెల్లడించారు.

కాంగ్రెస్ ను వీడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.తనకు నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.

నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు స్పష్టం చేశారు.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable