షోకాజ్ నోటీసులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన

ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.

ఈ మేరకు రెండు రోజుల క్రితమే నోటీసులకు రిప్లై ఇచ్చినట్లు తెలిపారు.

జనరల్ సెక్రెటరీ తారిక్ అన్వర్ అందుబాటులో లేరని చెప్పారు.తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు.

నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.నోటీసులు ఇస్తే భారత్ జోడో యాత్రలో ఎలా పాల్గొంటా అని ఆయన ప్రశ్నించారు.

ఆరోపణలపై ఏఐసీసీ క్లీన్ చిట్ వచ్చాకే యాత్రలో పాల్గొంటానని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు