అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గత రెండున్నరేళ్లుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై వచ్చిన అభియోగాలను తట్టుకోలేకపోతున్నట్లు చెప్పారు.

కేసు విచారణలో భాగంగా తనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.అధికారులు ఒక్క రోజు గడువుతో నోటీసులు ఇచ్చారన్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతానని సీబీఐకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.న్యాయం గెలవాలి.

నిజం తెలియాలని తెలిపారు.అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023