కాంగ్రెస్ నేతల్లో కదలిక ? రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందిగా ?

తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ బలోపేతం అవుతోంది.టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్నట్లుగా మొదట్లో ఉన్నా.

ఇప్పుడు ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించడంతో తెలంగాణ కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయింది.అయితే ఆ పరిస్థితిని మార్చి, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో పార్టీలో పదవుల కోసం నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.దీని కోసం అనేక రకాల ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.

దీంతో రేవంత్ ఒక కొత్త ప్రతిపాదన పెట్టడంతో పార్టీ కీలక నాయకులంతా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు.ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రాధాన్యమేమిటో చెబుతూ అధికార పార్టీ టిఆర్ఎస్ బిజెపిలో పైన విమర్శలు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ పార్టీపై పట్టు సాధించలేకపోయారు.ఆయనను వ్యతిరేకించేవారు కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉండడంతో పార్టీలో తన మార్క్ ఏమిటో చూపించేందుకు  ప్రయత్నిస్తున్నారు.

జనాల్లోకి కాంగ్రెస్ ను తీసుకు వెళ్లి గతంలో కాంగ్రెస్ కు అండదండలు అందించిన అన్ని వర్గాలను మళ్ళీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇటీవల 21 అంశాలతో రూపొందించిన డిక్లరేషన్ రైతులకు ఉపయోగపడేలా ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.

మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు జనాల్లో ఉండే విధంగా రేవంత్ ప్లాన్ చేశారు.దీనికోసం ప్రత్యేకంగా 400 మందిని నియమించారు .మొదట్లో ఈ కార్యక్రమం అంతంతమాత్రంగానే జరిగింది .ఇప్పుడు మాత్రం మంచి ఉత్సాహంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.

అలాగే సీనియర్ నాయకులు రచ్చబండ కార్యక్రమానికి ఆధార్ కార్డు పైన ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం పెద్ద ఎత్తున పాల్గొని ఉన్నాయి అయితే వీరంతా ఈ విధంగా యాక్టివ్గా రావడానికి కారణం డిసిసి అధ్యక్ష పదవులను భర్తీ చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడమే.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న  సమయంలో డిసిసి అధ్యక్షుల నియామకం చేపట్టారు.ఇప్పటి వారి కొనసాగుతున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు చాలా మంది ఉండడంతో.పార్టీ కోసం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేసినవారికి పనితీరు ఆధారంగా పదవులు కట్టబెడుతున్నారని , ఎటువంటి  సిఫార్సులు పనిచేయవని తేల్చి చెప్పేయడంతో ఇప్పుడు అందరిలోనూ కదలిక వచ్చిందట.పార్టీ పదవులు అశిస్తున్న వారంతా ఇప్పుడు జనాల్లో తిరుగుతూ రేవంత్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు