వేస‌విలో మౌత్ అల్స‌ర్ త‌ర‌చూ వేధిస్తుందా..అయితే ఈ టిప్స్ మీకే!

చ‌లి కాలం పోయి వేస‌వి కాలం రానే వ‌చ్చింది.మార్చి నెల నుంచే ఎండ‌లు మండిపోతుండ‌డంతో.

ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అయితే ఈ వేస‌వి కాలంలో ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో మౌత్ అల్స‌ర్ (నోటి పూత‌) ఒక‌టి.

శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం వ‌ల్ల త‌ర‌చూ ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంటుంది.ఇక మౌత్ అల్స‌ర్ వ‌చ్చిందంటే భ‌రించ‌లేనంత నొప్పి, మంట పుడుతుంది.

ఈ స‌మ‌యంలో ఆహారాన్నే కాదు.క‌నీసం వాట‌ర్ తాగాలన్నా చాలా క‌ష్టంగా ఉంటుంది.

Advertisement
How To Get Rid Of Mouth Ulcers In Summer! Mouth Ulcer, Summer, Summer Tips, Late

అయితే ఈ కొన్ని టిప్స్ పాటిస్తే వేస‌విలో వేధించే మౌత్ అల్స‌ర్‌ను సులువుగా మ‌రియు త్వ‌రగా నివారించుకోవ‌చ్చ‌ని అంటున్నారు నిపుణులు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

డీహైడ్రేష‌న్, శ‌రీరం అధిక వేడికి గురి కావ‌డం వ‌ల్ల స‌మ్మ‌ర్‌లో మౌత్ అల్స‌ర్ ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంది.ఈ స‌మ‌స్యకు చెక్ పెట్ట‌డంలో కొబ్బ‌రి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ప్ర‌తి రోజు కొబ్బ‌రి నీరు సేవించ‌డం, కొబ్బ‌రి నూనెను పుండ్లు ఉన్న చోట అప్లై చేయ‌డం, ఎండు కొబ్బ‌రి త‌ర‌చూ న‌మ‌ల‌డం చేస్తే త్వరగా మౌత్ అల్స‌ర్ దూరంఅవుతుంది.

How To Get Rid Of Mouth Ulcers In Summer Mouth Ulcer, Summer, Summer Tips, Late

మ‌జ్జిగ కూడా మౌత్ అల్స‌ర్ స‌మ‌స్య‌ను నివారిస్తుంది.అందువ‌ల్ల‌, త‌ర‌చూ మ‌జ్జిగ తాగితే మంచిది.అలాగే శ‌రీరంలో వేడి త‌గ్గించి మౌత్ అల్స‌ర్ స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో గ‌స‌గ‌సాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

గ‌స‌గ‌సాల‌ను అర స్పూన్ చ‌ప్పున రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.తుల‌సి ఆకులు కూడా ఫాస్ట్‌గా మౌత్ అల్స‌ర్ ను త‌గ్గిస్తాయి.కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని మెల్ల మెల్ల‌గా న‌ములుతూ మింగేయాలి.

Advertisement

ఇలా చేస్తే తుల‌సి ఆకుల నుంచి వ‌చ్చే ర‌సం నోటి పుండ్ల‌ను త‌గ్గిస్తాయి.ఇక మౌత్ అల్స‌ర్ ఉన్న వారు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

అలాగే స్మోకింగ్‌, మ‌ద్య‌పానం వంటి వాటిని మానుకోవాలి.వాట‌ర్ ఎక్కువ‌గా తాగాలి.

తాజా వార్తలు