Bejjarapu Mounika : ఆ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మౌనిక.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ జాబ్( Private Job ) సాధించాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎదురయ్యే కష్టాలు అన్నీఇన్నీ కావు.

అయితే ఒక యువతి మాత్రం ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.టీ.ఎస్.పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్స్ పెక్టర్( Drug Inspector Exams ) రాత పరీక్షలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు మౌనిక ఫస్ట్ ర్యాంక్ సాధించారు.శుక్రవారం రాత్రి రిలీజ్ చేసిన ఫలితాలలో 450 మార్కులకు మౌనిక 348 మార్కులు సాధించడం గమనార్హం.

పరీక్ష ఫలితాలలో మౌనిక ఫస్ట్ ర్యాంక్ సాధించారు.హైదరాబాద్ లో బీఫార్మసీ, అస్సాంలో ఎంఫార్మసీ పూర్తి చేసిన మౌనిక పంచాయితీ కార్యదర్శిగా ఆరు నెలలు పని చేశారు.

ఆ తర్వాత బెజ్జారపు మౌనిక( Bejjarapu Mounika ) ఫార్మసిస్ట్ ఉద్యోగ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించి హైదరాబాద్ లోని ఈ.ఎస్.ఐ( ESI )లో జాబ్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం మౌనిక డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం సాధించడంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు.మౌనిక సక్సెస్ స్టోరీ( Mounika Success Story ) నెటిజన్లలో స్పూర్తిని నింపుతుండగా ఆమె సాధించిన ఘన విజయాలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.మౌనిక ఖాతాలో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు చేరాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మౌనిక తన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారని కొంతమంది సోషల్ మీడియా( Social Media ) వేదికగా కామెంట్లు చేస్తున్నారు.రేయింబవళ్లు కష్టపడితే ఏదో ఒకరోజు కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుందని మౌనిక సక్సెస్ తో మరోమారు ప్రూవ్ అయింది.

మౌనిక రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.నేటితరం పిల్లలు సైతం స్పష్టంగా లక్ష్యాలను నిర్దేచించుకుని కెరీర్ కోసం కష్టపడితే సులువుగానే లక్ష్యాలను సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమ్మ మీద కోపం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సిరి వెన్నెల
Advertisement

తాజా వార్తలు