Mouni Roy : తీవ్ర అస్వస్థకు గురైన కేజీఎఫ్ బ్యూటి.. 9 రోజుల పాటు ఆసుపత్రిలో అలా?

సీరియల్ హీరోయిన్ మౌని రాయ్( Mouni Roy) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

చాలామంది బుల్లితెర నటులు మౌని రాయ్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ నాగిని సీరియల్ హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఈ ఒక్క సీరియల్ తో దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది మౌని రాయ్.హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

కాగా నాగిని సీరియల్ తెలుగులో కూడా ప్రసారమైన విషయం తెలిసిందే.నాగిని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

మొదట మోడల్ గా కెరిర్ ను ఆరంభించి ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె ఇటీవల రిలీజ్ అయిన బ్రహ్మస్త్ర మూవీలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన కె.జి.యఫ్ చాప్టర్ 1 మూవీలో ఐటెం సాంగ్ లో తన అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

తాజాగా మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో తన హెల్త్ కండీషన్ గురించి సంచలన విషయాలు అభిమానులకు షేర్ చేసింది.నేను అనారోగ్యంతో 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.

ఆ సమయంలో చాలా లోతైన నిశ్చలతతో నేను మునిగిపోయాను.

ఆస్పత్రిలో చాలా బాధను అనుభవించాను.ప్రస్తుతం అనారోగ్యం( Health issue) నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను.ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చాను.

ఇన్ని రోజులు నా కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన హాస్పిటల్ సిబ్బందికి నా కృతజ్ఞతలు, నేను ఇంతకు ముందు కన్నా చాలా బాగున్నానని చెప్పడానికి పోస్ట్ చేశాను అని తెలిపింది మౌని రాయ్.ఆ సుపత్రిలో ఉన్న సమయంలో నా భర్త నంబియార్ నాకు ఎంతో తోడుగా నిలిచారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ధైర్యం చెప్పారు.నా జీవితం అంతా ఆయనకు రుణపడి ఉంటాను అని చెప్పింది.

Advertisement

తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపిన స్నేహితులు, అభిమానులు ఒక్కరికి రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది.అయితే మౌనీ రాయ్ హాస్పిట్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందన్న విషయం మాత్రం చెప్పలేదు.

ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు మౌనీ రాయ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు