చంద్రబాబు పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో టిడిపి “కేల్ కతమ్ దుకాణ్ బంద్” అన్నట్టుగానే ఉంది.ప్రస్తుతానికి కొన ఉపిరితో కొట్టుకుంటోంది.

ఈ సమయంలో టిడిపిని అంటిపెట్టుకుని ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు.దానిలో మోత్కుపల్లి ఒకరు.

అయితే చంద్రబాబు పట్ల ఉన్న గౌరవమో , గవర్నర్ పదవి మీద ఉన్న వ్యామోహమో కానీ మొత్తానికి మోత్కుపల్లిని టిడిపిలోనే కొనసాగేలా చేస్తోంది.అయితే అసలు వివరాలలోకి వెళ్తే.

ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.రేవంత్ అనేవాడు నాయకుడే కాదు,నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి కి లేవు అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రేవంత్ కి అప్పట్లో “వర్కింగ్ ప్రెసిడెంట్” పదవిని కట్టబెట్టి పెద్ద తప్పు చేశారని అన్నారు.ఎంతో ఉన్నతమైన పదవి ఇచ్చిన తెలుగుదేశ పార్టీని కాదనుకుని తన స్వార్ధం కోసం రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళారని.

మీడియా కూడా రేవంత్ పెద్ద హీరో అన్నట్టుగా సహకరించింది అంటూ ఆరోపించారు.పనిలో పనిగా తానూ ఆశపడ్డ గవర్నర్ పదవి మీద కూడా మాట్లడారు.

నాకు గవర్నర్ పదవి వస్తుంది అని ఎంతో ఆశించాను, ఎన్నో ఊహించుకున్నాను.అందరికీ ఈ విషయం తెలిసి నేను ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నర్ గారు వస్తున్నారు అంటూ అనేవారు అయితే ఒక్కసారిగా గవర్నర్ పదవి రాకపోవడంతో షాక్ కి గురయ్యాను అన్నారు.

ఇక ఆ పదవిపై ఆశలు పెట్టుకోలేదని చెప్పారు.ఆలోచించకుండా ఇలా ఉంటేనే ఆరోగ్యానికి మేలు అంటూ చెప్పుకోస్తూనే తన అసహనాన్ని ప్రదర్శించారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే..

అయితే నాకోసం చంద్రబాబు ఎతో ప్రయత్నించారని అయితే నా దురదృష్టం అవకాశం .రాకుండా పోయింది అని అన్నారు.

Advertisement