కూతురు పెళ్లి చూసి ICUలో కన్నుమూసిన తల్లి!

కొన్ని కొన్ని సంఘటనలను గురించి తెలిసినపుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.సాధారణంగా ఇలాంటివి సినిమాలలో మనం చూస్తుంటాం.

కానీ నిజ జీవితంలో కూడా జరుగుతాయి అని ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంటుంది.తాజాగా అలాంటి ఓ సంఘటన బిహార్‌లోని గయ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగింది.

అక్కడ ICU వార్డులో తల్లి ఆఖరి కోరిక మేరకు కూతురి వివాహం జరిగింది.కాగా ఆ పెళ్ళితంతు చూసిన పిదప కాసేపాటికీ ఆ తల్లి ICUలో మృతి చెందడం రక్తసంబంధీకులకే కాకుండా ఆమెకి వైద్యం చేసిన డాక్టర్లకి కూడా ఎంతో బాధ కలిగింది.

అవును, బీహార్‌లోని గయాలో అలాంటి పెళ్లిని చూసి వధూవరులతో పాటు ప్రజలు మొదలుకొని ఆసుపత్రి సిబ్బంది కూడా కంటతడి పెట్టడం స్థానికంగా కలచివేసింది.వివరాల్లోకి వెళితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆ తల్లి పేరు పూనమ్ కుమారి వర్మ.

Advertisement

అతను తన కుమార్తె చాందినీ కుమారికి ఇంజనీర్ అయినటువంటి సుమిత్ గౌరవ్‌తో తాజాగా నిశ్చితార్థం జరిగింది.కానీ అమ్మాయి తల్లి ఆరోగ్యం క్షీణించడంతో, నిశ్చితార్థానికి ఒక రోజు ముందు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది.

ఆమె కోరికని కాదనలేని పెద్దలు ICUలో వివాహం జరిపించారు.ఈ వివాహానికి ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా అనుమతి రావడంతో ఇరు కుటుంబాలు వధూవరులు, బంధువులులతో కలిసి ICUకు చేరుకున్నారు.కాగా ICU బెడ్‌లో ఉంటూనే కూతురు, అల్లుడిని చూస్తూ ఉండిపోయింది ఆ తల్లి.

ఈ సందర్భంగా పండితులు ఇరువురికీ వైవాహిక జీవిత ప్రతిజ్ఞ చేయించి, పూలదండలు మార్చుకున్నారు.కాగా పెళ్లయిన 2 గంటలకే వధువు తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.

అయితే గుండె జబ్బు వలన ఆ తల్లి పరిస్థితి విషమించడంతో.ఆమె ప్రాణాలు కాపాడటం కష్టమని వైద్యులు చెప్పడంతో.ఆమె కోరిక తీర్చేందుకు ఆస్పత్రిలో పెళ్లికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
Advertisement

తాజా వార్తలు