Fun Game : సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫన్నీ గేమ్.. వీడియో చూస్తే..!

ఇటీవల కాలంలో చాలామంది పిల్లలు, పెద్దలు స్మార్ట్‌ఫోన్లకు( Smartphones ) బాగా అలవాటు పడ్డారు.

ఇంతకుముందు బయట ముచ్చట్లు పెట్టుకుంటూ, ఆడుకుంటూ ఎంతో హాయిగా గడిపేవారు కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్‌లో గేమ్స్, వీడియోస్( Games ) చూస్తూ టైమ్‌ పాస్ చేస్తున్నారు.

దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ప్రజలు ఇలాంటి పేలవమైన జీవన శైలి గడుపుతున్న సమయంలో ఒక ఔట్‌డోర్ ఫన్ గేమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిని @ Enezator ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే ఒక కోటి 24 లక్షల వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో( Viral Video )లో ముగ్గురు వ్యక్తులు ఒక పరదా లాగా నేలపై పరిచిన దాని ముందు నిల్చుని ఉండటం మనం చూడవచ్చు.ఆ మ్యాట్ పైన నల్లటి కవర్స్ ఉన్నాయి.దీనిపై ఒక్కొక్కరిగా దూకుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.ఆ నల్లటి కవర్స్ కింద గుంటలు కూడా ఉన్నాయి.

కానీ ఆ విషయం దూకే వారికి తెలియదు.ఒక కవర్ కింద గుంట ఉంటే, మరొక కవర్ కింద నేల ఉంటుంది.

నేల పైన ఉన్న కవర్ పై అడుగేస్తే ముందుకు వెళ్ళవచ్చు.లేదంటే గుంటలో పడిపోయి గేమ్ ఓవర్ అయిపోతుంది.

ఇది స్టంబుల్ గాయ్స్ గేమ్( Stumble Guys Game ) లో ఒక లెవెల్ లాగానే ఉంటుంది.కానీ రియల్ లైఫ్ లో దీన్ని ఆడితే గాయాలు అయ్యే అవకాశం ఉంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అదే సమయంలో చాలా ఫన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది.

Advertisement

వీడియోలో చూసినట్టుగా ముగ్గురు వ్యక్తులు ఆ ఆటను ఆడుతూ ఎంజాయ్ చేశారు.గుంటలో పడిపోయి గేమ్ ఫెయిల్ అయినప్పుడల్లా మిగతా ప్లేయర్స్ తెగ నవ్వేసుకున్నారు.చివరిలో ఒక లావు ఉన్న వ్యక్తి దూకి గుంటలో పడ్డప్పుడు మిగిలిన ఇద్దరు పగలబడి నవ్వారు.

వీరు జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేయడం చూసి నెటిజన్లు( Netizens ) ఫిదా అవుతున్నారు.