ప్రతి ఏటా లక్షలమంది కిడ్ని సమస్యలతో ఆస్పత్రి మంచం ఎక్కుతున్నారు.రాళ్లు చేరడం నుంచి కిడ్ని పూర్తిగా పాడయ్యేవరకు .
అన్ని సమస్యలకి మనుషుల అలవాట్లే కారణం.కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మూత్రాన్ని ఆపడం : చాలామంది మూత్రాన్ని ఆపుతూ ఉంటారు.పరిస్థితులు అనుకూలించకపోతే, గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే ఆపేవారు కూడా ఉన్నారు.
ఇలా చేయడం వల్ల కిడ్నిలో రాళ్ళు చేరే పరిస్థితితో పాటు కిడ్నీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం రావొచ్చు.* తీపి ఎక్కువగా తినటం : తీపివస్తువులు రుచికరంగా ఉంటాయి కాని, ఆరోగ్యానికి ఎన్నోరకలా ముప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి.ఫ్రుక్టోస్ అతిగా శరీరంలోకి చేరితే అది కిడ్నీలకు చాలా ప్రమాదం కావచ్చు.
కావట్టి తీపి వస్తువులు ఎప్పుడోకాని తినకూడదు.* అదుపు తప్పిన బ్లడ్ ప్రెషర్ : ఎప్పుడో ఏదో ఒక సమస్య వస్తే తప్ప, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం అలవాటు ఉండదు మనకు.ఇది చాలా తప్పు.
రెగ్యులర్ గా బ్లడ్ ప్రెషర్ చేక్ చేసుకోని, రక్తప్రసరణను అదుపులో ఉంచుకోవాలి.* పద్ధతిగా లేని మందుల వాడకం : ప్రతీ చిన్న విషయానికి మందుమాత్రలు వాడటం కరెక్టు విషయం కాదు.అలాగే డాక్టరు చెప్పిన పద్ధతిలోనే మందులు వాడాలి.
సమయం తప్పడం, లెక్కతప్పడం మీ కిడ్నీకి మంచిది కాదు.* సిగరేట్లు, మద్యపానం : కిడ్నీలకు అతిపెద్ద శతృవులు ఈ అలవాట్లు.మధుమేహం లాంటి జబ్బు ఉండి, ఈ అలవాట్లు కూడా ఉంటే అది ఇంకా ప్రమాదం.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy