భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు

ఈ నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో( Bhopal ) జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్( Global Investors Summit ) రెండవ రోజున జరగనున్న ప్రవాసీ మధ్యప్రదేశ్ సమ్మిట్‌కు( Pravasi Madhya Pradesh Summit ) హాజరు కావడానికి అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆగ్నేయాసియా , ఇతర దేశాల నుంచి 130 మందికి పైగా ప్రవాస భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారు.ఈ ప్రవాసీ సమ్మిట్‌లో దాదాపు 300 మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

2025 ఫిబ్రవరి 24 , 25 తేదీల్లో భోపాల్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐల( NRIs ) కోసం ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు.ఈ సమ్మిట్ ఏర్పాట్లపై మధ్యప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఎంపీఐడీసీ) సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు.

ఈ సమ్మిట్ కోసం ఇప్పటి వరకు 130 మందికి పైగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు మాకు అందాయని ఆయన వెల్లడించారు.రాష్ట్రం , నోడల్ విభాగాల నుంచి అనేక మంది కీలక ప్రతినిధులకు నేరుగా ఆహ్వానాలు అందాయని ఆయన తెలిపారు.

ఈ సెషన్‌కు దాదాపు 300 మంది ఎన్ఆర్ఐలు హాజరవుతారని తాము ఆశిస్తున్నామని సదరు అధికారి వెల్లడించారు.

More Than 300 Nris Expected To Attend In Global Investors Summit In Bhopal Detai
Advertisement
More Than 300 NRIs Expected To Attend In Global Investors Summit In Bhopal Detai

ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.మధ్యప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమ విధానపాలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందించే శాఖాపరమైన సాయం గురించి ఎన్ఆర్ఐలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఈ ఏడాది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జపాన్, పోలాండ్, మొరాకో, ఫిజి, టోగో, కోస్టారికా, పలావు, జిబౌటీ, యూకే, యూఎస్, మలేషియా, నేపాల్, మంగోలియా, మయన్మార్, కెనడా, జర్మనీ, మెక్సికో, జింబాబ్వే దేశాలు పాల్గొంటున్నాయి.

More Than 300 Nris Expected To Attend In Global Investors Summit In Bhopal Detai

లాజిస్టిక్స్, గిడ్డంగులు, సహజ వాయువు, పెట్రో కెమికల్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, వ్యవసాయం, మిల్క్ ప్రాసెసింగ్, పునరుత్పాదక శక్తి, ఏరోస్పేస్, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, ఐటీ వంటి వాటిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది.

Advertisement

తాజా వార్తలు