చలో కెనడా అంటోన్న భారతీయ టెక్కీలు.. 12 నెలల్లో అంత మందా..?

మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.

అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.

కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా భారతీయులు చలో కనడా అంటున్నారు.

గడిచిన 12 నెలల కాలంలో దాదాపు 15,000కు పైగా మంది భారతీయ టెక్కీలు కెనడా( Canada )కు వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

ది టెక్నాలజీ కౌన్సిల్స్ ఆఫ్ నార్త్ అమెరికా (టీఈసీఎన్ఏ), కెనడా టెక్ నెట్‌వర్క్ (సీటీఎన్)లు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 మధ్య కెనడాకు తరలివచ్చిన ప్రపంచ స్థాయి టెక్ కార్మికులలో భారత్‌కు చెందినవారు ఎక్కువగా వున్నారని తెలిపింది.32,000కు పైగా వున్న మొత్తం టెక్ కార్మికులలో.15,097 మంది భారత్ నుంచి వచ్చారు.ఆ తర్వాత స్థానంలో నైజీరియన్లు వున్నారు. కెనడా ఇమ్మిగ్రేషన్ ఫ్రెండ్లీ నేషనల్ పాలసీ, లేబర్ కాస్ట్ అడ్వాంటేజ్ కారణంగా వలసలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.3,00,000 మంది సాంకేతిక నిపుణులతో దాదాపు 1000 ఐటీ కంపెనీలకు నిలయమైన మిస్సిసాగాలో 2015-2020 వరకు 31 శాతం టెక్ ఎకో సిస్టమ్‌లు వృద్ధి చెందిన మాంట్రియల్( Montreal ) కెనడాలో టెక్ ఇండస్ట్రీలో అగ్రగామిగా వుంది.ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 1900 మంది టెక్ వర్కర్స్ మిస్సిసాగా( Mississauga )కు వచ్చారు.959 మంది ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో మాంట్రియల్‌కు వచ్చారు.

Advertisement

అమెరికాలో ప్రస్తుతం హెచ్ 1 బీ వీసాపై( H-1B visa ) వున్న నిపుణులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇస్తామంటూ ఇటీవల కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చింది.తొలి రోజులోనే ఈ పథకం దాని లక్ష్యాన్ని చేరుకుంది.హెచ్ 1 బీ వీసాదారుల కోసం కొత్త వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 16 నుంచి కెనడా అనుమతించింది.

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) దీనిపై తాజాగా ప్రకటన చేసింది.ప్రస్తుతం సరిపడినన్ని దరఖాస్తులు రావడంతో ఈ స్కీమ్‌ను మూసివేస్తునట్లు తెలిపింది.జూలై 17న ఈ కొత్త స్కీమ్ కోసం 10,000 దరఖాస్తుల పరిమితిని చేరుకున్నామని ఐఆర్‌సీసీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు