మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి నిర్మాత ఎవరో తెలుసా.. భారీ బడ్జెట్ తో భారీ ప్లాన్ అంటూ?

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉండనుందని క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకుడు అని తేలిపోయింది.మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ప్రశాంత్ వర్మ పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ సినిమాకు బాలయ్య( Balayya ) నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.బాలయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తే మాత్రం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఈ ఏడాదే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని భోగట్టా.ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ఇప్పటికే బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం అందుతోంది.100 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Advertisement

2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా ఆరోజు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ( Mokshagna First Movie ) గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే అధికారికంగా వెల్లడయ్యే వార్తలు, విషయాలను మాత్రమే నమ్మాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

బాలయ్య, మోక్షజ్ఞ కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.బాలయ్య ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలలో నటించిన సందర్భాలు లేవు.మోక్షజ్ఞను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నందమూరి మోక్షజ్ఞ సినిమాలు సైతం భారీ స్థాయిలో అంచనాలను మించి ఉండాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మోక్షజ్ఞను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనే చెప్పాలి.

రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు