ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన మోక్షజ్ఞ.. మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం పక్కా అంటూ?

నందమూరి అభిమానులు బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ( Nandamuri Mokshajna )సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ పై కూడా ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

నందమూరి అభిమానులు ఎక్కడెక్కడ అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది.బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఎంట్రీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ప్రశాంత్ వర్మ( Prashant Verma ) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది.

Mokshagna And Prashant Varma Movie First Look, Mokshagna, Prashanth Varma, First

సినిమాటిక్ యునివర్స్ ( Cinematic Universe )లో భాగంగా ఈ ప్యాన్ ఇండియా మూవీని సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, విఎఫెక్స్ ఎఫెక్ట్స్( Socio fantasy background, vfx effects ) తో తీయబోతున్నారు.హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్.వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది.

Advertisement
Mokshagna And Prashant Varma Movie First Look, Mokshagna, Prashanth Varma, First

అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు మాత్రం ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక స్పెషల్ రోల్ లో నటించబోతున్నారు అన్న విషయం తెలిసిందే.

అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

Mokshagna And Prashant Varma Movie First Look, Mokshagna, Prashanth Varma, First

ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేకోవర్ చేసుకున్న మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు.డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదని బాలయ్య ఏళ్ళ తరబడి సమయం ఖర్చు పెట్టారు.ఒకదశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.ఆ ఫోటోలో సరికొత్త లుక్ లో కనిపించడంతోపాటు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు మోక్షజ్ఞ.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఆ ఫోటోని చూసిన అభిమానులు తెగ వైరల్ చేయడంతో పాటు కామెంట్ల మోత మోగిస్తున్నారు.మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు