మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఆ సత్తా లేదు అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మరియు హీరోగా ఇలా అన్నీ రకాల పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పాటు చేసుకున్న లెజెండ్స్ లో ఒకడు మోహన్ బాబు( Mohan Babu ).

విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన తర్వాత హీరో గా సక్సెస్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

అది మోహన్ బాబు విషయం లో జరిగింది.హీరో గా ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో నటించాడు ఆయన.కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా కూడా నిలిచాయి.చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ బాబు, హీరో గా మారి, వాళ్ళతో సరిసమానమైన మార్కెట్ ని సంపాదించుకున్నాడు.

ఇది సాధారణమైన విషయం కాదు.కానీ కొత్త హీరోల రాక తర్వాత మోహన్ బాబు మార్కెట్ చిన్నగా తగ్గుతూ వచ్చింది.2000 దశకం ప్రారంభం లోనే ఆయన తన స్టార్ స్టేటస్ ని పోగొట్టుకున్నాడు.

ఆయన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీ లోకి వచ్చి, పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా చేసినప్పటికీ కూడా ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడం లో విఫలం అయ్యారు.దీంతో మంచు ఫ్యామిలీ కి ఇండస్ట్రీ లో మార్కెట్ లేకుండా పోయింది.ఇప్పుడు చివరి ప్రయత్నం గా మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప( Kannappa ) ని చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా కోసం ఆయన తన యావదాస్తిని పెట్టుబడిగా పెట్టి నిర్మిస్తున్నాడు.ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో ముఖ్య పాత్రలను పోషించబోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మోహన్ బాబు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

యాంకర్ మోహన్ బాబు తో మాట్లాడుతూ ఎందుకు మీరు ఈమధ్య నటన కి దూరంగా ఉంటున్నారు?, టాలీవుడ్ డైరెక్టర్స్ మిమల్ని పట్టించుకోవడం లేదా?, లేకపోతే మీతో సినిమాలు తియ్యడానికి భయపడుతున్నారా? అని అడగగా దానికి మోహన్ బాబు సమాధానం చెప్తూ నాకు సరైన పాత్రలు రాసే సత్తా డైరెక్టర్స్ లో లేదు అని నాకు అనిపించింది.ఈమధ్య రెండు మూడు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను , ఎందుకో నాకు సంతృప్తి ఇవ్వలేదు. రజినీకాంత్( Rajinikanth ) ఒక రోజు ఫోన్ చేసి, నా కొత్త సినిమాలో ఒక విలన్ రోల్ ఉందిరా, నీకు తీసుకుందాం అన్నారు, కానీ నేనే ఒప్పుకోలేదు అని చెప్పాడు.

ఎందుకు రా అని అడిగితే ఆ సినిమాలో నేను నిన్ను కొట్టేది ఉందిరా, నేను నిన్ను కొట్టొద్దు, నువ్వు నన్ను కొట్టొద్దు, మన ఇద్దరం ఆ స్టేజిని దాటేశాం అని అన్నాడు, సరేరా అని అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు