ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని బాబు లాక్కున్నాడు! మోహన్ బాబు సంచలన వాఖ్యలు

గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలనంగా మారారు.

ముందుగా తన విద్యాసంస్థలకి ఫీజు రియాంబర్స్మెంట్ ఇవ్వలేదని రోడ్డెక్కి విమర్శలు చేసిన మోహన్ బాబు పై టీడీపీ పార్టీ నేతలు ఎదురుదాడి చేసి అతనిని అరెస్ట్ కూడా చేయించారు.

దీంతో ఒక్కసారిగా మోహన్ బాబు తన వ్యూహం మార్చి చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.అందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ సమక్షంగా ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఆ తరువాత చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసారు.అయితే మోహన్ బాబు అలా వైసీపీలో చేరడంపైన టీడీపీ నేతలు ఎదురుదాడి చేసారు.

ఈ నేపధ్యంలో మరోసారి మోహన్ బాబు మీడియా ముందుకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసారు.టీడీపీ అధినేతగా చెప్పుకున్న చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్ అని, ఎన్టీఆర్ దయతో పార్టీలోకి వచ్చి మోసం చేసి, కుట్ర రాజకీయాలకి తెరతీసి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఇప్పుడు నీతులు చెబుతున్నాడని దయ్యబట్టారు.

Advertisement

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీని, అన్నగారి ఆశయాలని తుంగలో తొక్కి ఇప్పుడు అదే పార్టీతో జత కట్టాడని విమర్శించారు.జగన్ కి అనుభవం లేని మాట వాస్తవం అయిన కూడా అతని నిబద్ధతకి అతని అంకితభావంకి ఒక్క అవకాశం ఇస్తే తన సత్తా చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పార్టీ త్వరలో భూస్థాపితం కాబోతుంది అని మోహన్ బాబు విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు