సినిమా ఇండస్ట్రీ లో హీరోల మద్య అప్పుడప్పుడు మనస్పర్థలు అనేవి రావడం కామన్ అందులో బాగం గానే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి మోహన్ బాబు( Mohan Babu ) కి మధ్య కొన్ని సార్లు కొన్ని సంఘటనలు జరిగాయి.
అయిన కూడా మోహన్ బాబు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ( Chiranjeevi ) రెండు కూడా మంచి సానిహిత్యం గా ఉంటాయి.
అయితే పవన్ కళ్యాణ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చారు మోహన్ బాబు.విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.
అలాగే నిర్మాతగా , విద్యాసంస్థల అధినేతగాను సత్తా చాటారు .ఇక పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.ఆ తర్వాత తమ్ముడు , ఖుషి , భద్రి వంటి హిట్స్ తో స్టార్ హీరోగా ఎదిగారు .అలాగే వీళ్లిద్దరి మధ్య విభేదాలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి .వజ్రోత్సవ వేడుకల్లో పవన్ .మోహన్ బాబు పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి .అయితే మోహన్ బాబు ఫ్యామిలీ , మెగా ఫ్యామిలి మధ్య స్నేహం ఉందని మాత్రం ఆయా కుటుంబాల సభ్యులు చెబుతూనే ఉంటారు .
చిరు -మోహన్ బాబు కాస్త ఐక్యంగానే కనిపిస్తారు .అయితే గత ఏడాది కూడా పవన్ .మోహన్ బాబు పై కొన్ని వ్యాఖ్యలు చేశారు .తన మేనల్లుడి మూవీ ఈవెంట్ లో ఇండస్ట్రీ మొదలుకొని రాజకీయాల వరకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీనియర్ నటుడు మోహన్ బాబు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువేనని.
సినిమా పరిశ్రమ ఇబ్బందులను ఆయన జగన్ మోహన్ రెడ్డికి చెప్పాలని అన్నారు.పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు అప్పట్లోనే స్పందించారు.చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.
సంతోషమే.నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను అని చెప్పుకుకొచ్చారు .ఇదే సమయంలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కి పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళతారని ప్రచారం సాగింది.
తిరుపతి నియోజకవర్గం నుండి మనోజ్ పవన్ పార్టీ నుంచి పోటీ చెయ్యబోతున్నట్టు వార్తలు వచ్చాయి .అయితే ఆ తర్వాత అవి గాసిప్స్ అని అర్ధం అయింది .ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .పవన్ తనకి మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు .ఇటీవల మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూ లు ఇచ్చారు .అందులోనే పవన్ గురించి మాట్లాడారు .పవన్ కళ్యాణ్ పిలువాలేగాని ఏ రోల్ ఇచ్చిన చేస్తా అని కూడా చెప్పారు .మరి జనసేన కి సపోర్ట్ చేస్తారా అంటే మాత్రం సూటిగా చెప్పలేదు .సినిమాలు రాజకీయాలు వేరని చెప్పుకొచ్చారు .మొత్తంగా మోహన్ బాబు చేసిన వ్యాల్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి .పవన్ అంటే తనకు ఇష్టం అని చెప్పడంతో మెగాభిమానులు ఖుషి అవుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy