కుటుంబ వివాదాలపై మొదటి సారి స్పందించిన మోహన్ బాబు... మామూలే అంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి .

అయితే గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

మంచు మనోజ్( Manchu Manoj ) విష్ణు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి.  అయితే ఈ వివాదాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.

ఇక ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్ పై దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలు పాలయ్యారు.దీంతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తనకు తన భార్య పిల్లలకు ప్రాణహాని ఉందని ఈయన కేసు నమోదు చేశారు.మరోవైపు మోహన్ బాబు( Mohan Babu ) కూడా తన కొడుకు మనోజ్ , అలాగే మౌనిక పై( Mounika ) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Mohan Babu React On Manchu Family Controversy Details ,Manchu Family,Manoj, Vish

ఇలా ఈ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు చోటుచేసుకున్నాయి.ఇక ఈ గొడవల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చారు.

ఇక మీడియా సమావేశంలో భాగంగా ఈయన తన ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి క్లారిటీ ఇచ్చారు.

Mohan Babu React On Manchu Family Controversy Details ,manchu Family,manoj, Vish

ఒక కుటుంబం అన్న తర్వాత ఆస్తి విభేదాలు రావడం సర్వసాధారణం అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు ఆస్తి తగాదాలు మామూలేనని ఈయన తెలిపారు.ఇక మా ఇంట్లో ఉన్నటువంటి ఈ గొడవలను వారిద్దరే పరిష్కరించుకుంటారని మోహన్ బాబు తెలిపారు.ఇక కుటుంబ పెద్దలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ విభేదాల గురించి చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది.

ఇక ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు( Manchu Vishnu ) దుబాయిలో ఉన్నట్లు వెల్లడించారు.

Mohan Babu React On Manchu Family Controversy Details ,manchu Family,manoj, Vish
Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

ఇలా తన కుటుంబంలో చోటు చేసుకున్న ఈ గొడవలను తెలుసుకున్న మంచు విష్ణు వెంటనే హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది.ఇక విష్ణు రాకతో వీరి ముగ్గురి మధ్య చర్చలు జరిగితే వీరి విభేదాలు ఓ కొలిక్కి వస్తాయని తెలుస్తోంది.అయితే ఇలా ఆస్తి విషయంలో గత కొంతకాలంగా మనోజ్ విష్ణు మధ్య తగాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు