Narendra Modi : నాగర్ కర్నూల్ జిల్లాలో మోదీ పర్యటన..!!

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో మోదీ పర్యటించనున్నారు.

కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

ఈ సభా వేదికపై నుంచి కృష్ణమ్మ క్లస్టర్ కు చెందిన నల్గొండ, మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూ( Nagarkurnool )ల్ అభ్యర్థులను మోదీ పరిచయం చేయనున్నారు.ముందుగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ నుంచి బేగంపేటకు మోదీ వెళ్లనున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో నాగర్ కర్నూల్ కు చేరుకోనున్న మోదీ సభా వేదికకు చేరుకోనున్నారు.

కాగా ప్రధాని రాక నేపథ్యంలో పార్టీ నేతలతో పాటు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు