ఏపీ విషయంలో మోడీ సర్కార్( Narendra Modi ) చిన్న చూపు వహిస్తుందని గత కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపులోనూ విశాఖ ప్రయివేటీకరణ విషయంలోనూ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు గత కొన్నాళ్లుగా చర్చనీయాంశం అవుతూనే ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేయబోతున్నాట్లు గతంలో ప్రకటించి ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది మోడీ సర్కార్.అయితే ఎన్ని విమర్శలు వచ్చిన ప్రయివేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని గతంలో ఘంటాపథంగా చెబుతూ వచ్చింది.
కానీ ప్రజెంట్ ఏమైందో తెలియదు గాని విశాఖ ప్రయివేటీకరణ ఆగిపోయిందంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.స్టీల్ ప్లాన్ ప్రయివేటీకరణ నిలిచిపోయిందని, కర్మాగారాన్ని లాభాల బాటా నడిపించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు( GVL Narasimharao ) తాజాగా స్పష్టం చేశారు.అయితే ఇంత సడన్ గా విశాఖ విషయంలో కేంద్రం వెనక్కి తగాడానికి కారణం ఎన్నికల వ్యూహమే అనేది కొందరి అభిప్రాయం.
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ సర్కార్ పై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
దీంతో ఏపీ ప్రజలు వ్యతిరేకించేలా ఇంకా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే తాత్కాలికంగా ప్రయివేటీకరణ అంశాన్ని కేంద్రం హోల్డ్ లో ఉంచిందనేది కొందరి అభిప్రాయం.అయితే ఎన్నికల తరువాత మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందా అంటే అనుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.మరోవైపు జనసేన పార్టీతో( Jana Sena ) కలిసి బలపడాలని బీజేపీ( BJP ) చూస్తున్నప్పటికి పవన్ మాత్రం బీజేపీతో నామమాత్రంగానే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ ప్రయివేటీకరణ వంటి అంశాలను మళ్ళీ తెరపైకి తెస్తే అటు మిత్రపక్ష పార్టీల్లోనూ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది.ఈ కారణం చేతనే వ్యూహాత్మకంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని మోడీ సర్కార్ హోల్డ్ లో ఉంచినట్లు తెలుస్తోంది.
మరి ముందు రోజుల్లో దీనిపై ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy