సాద్వీని సపోర్ట్ చేయరు సరే... పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరు

మాలెగావ్ బాంబు పేలుళ్ళలో ప్రధాన ముద్దాయి సాద్వీ ప్రజ్ఞా సింగ్ గాడ్సే దేశ భక్తుడు అని చేసిన వాఖ్యలపై దేశం మొత్తం దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ఇక ఆమె వివాదాస్పద వాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ యాక్షన్ కి సిద్ధం అయ్యింది.

ఇక ఈ బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె వివాదాస్పద వాఖ్యాల కారణంగా బీజేపీ పార్టీ మొత్తం కార్నర్ అవుతూ ప్రతిపక్షాల విమర్శలకి టార్గెట్ అవుతుంది.ఈ నేపధ్యంలో సాద్వీ వాఖ్యలపై బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసారు.

దీంతో వెనక్కి తగ్గిన ఆమె తన వాఖ్యాలని వెనక్కి తీసుకున్నారు.తాజాగా సాద్వీ వాఖ్యలపై ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోడీకి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే ఆమె వాఖ్యలని సమర్ధిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మోడీ, సాద్వీ వాఖ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఆమెని ఎప్పటికి పార్టీ క్షమించదని చెప్పడం విశేషం.అయితే ఆమెని పార్టీ నుంచి ఎందుకు ఇంత వరకు బహిష్కరించలేదు అనే ప్రశ్న ఎదురవుతుంది.

Advertisement

మరో వైపు సాద్వీ మాటలు బీజేపీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విశేషం.

Boyle Sports Customer Support And Service Quality : A Practical Guide For UK Players
Advertisement