మోడీ అలా..అరవింద్ ఇలా..ఎన్ని చేసినా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదుగా..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీపై మరొక పార్టీ విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్ (Congress) వాళ్లు బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటేనని అంటే బిజెపి వాళ్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని అంటున్నారు.

ఇక బీఆర్ఎస్ అయితే ఏకంగా నేషనల్ పార్టీ అయినా బిజెపి కాంగ్రెస్ ఒక్కటేనని ఇలా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు.బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని అనడంలో ఒక అర్థం ఉంది.

ఎందుకంటే లిక్కర్ కేసులో కవిత (Kavitha) అడ్డంగా దొరికినా కూడా ఆమెను కేంద్రం ఏమీ చేయలేక పోతుంది.ఇక ఈ విషయంలో వీరిద్దరూ ఒక్కటేనని తేలిపోయింది.

ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని అనడంలో కూడా ఒక అర్థం ఉంది.ఎందుకంటే కాంగ్రెస్ లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది.

Modi Is Like That..arvind Is Like That..no Matter What He Does, The Plan Is Not
Advertisement
Modi Is Like That..Arvind Is Like That..no Matter What He Does, The Plan Is Not

ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat Reddy ) కూడా కాంగ్రెస్ కి 50 కంటే ఒక్క సీటు తగ్గినా కూడా మిగిలిన ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ కి వెళ్తారని బహిరంగగానే చెప్పేశారు.అయితే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటి కాదు అని ప్రజలందరికీ తెలియజెప్పాలని బిజెపి వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వీరి మధ్య సాన్నిహిత్యం బయటపడుతుంది.

ఈరోజు తుక్కుగూడ సభలో నరేంద్ర మోడీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ పై ఎన్నో విమర్శలు చేశారు.

Modi Is Like That..arvind Is Like That..no Matter What He Does, The Plan Is Not

అంతేకాదు ఒకవేళ మీరు కాంగ్రెస్ కి ఓటు వేసినా కూడా ఆ పాలన అచ్చం కెసిఆర్ ( KCR ) పాలన లాగే ఉంటుంది అని చెప్పారు.అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒక్కటేనని మరోసారి చెప్పారు.ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి, బీఆర్ఎస్ లు ఒక్కటి కాదు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం బిజెపి బిఆర్ఎస్ ఒక్కటే అన్నట్లుగా మాట్లాడారు.

ఆయన తాజాగా ఓ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ని విమర్శిస్తూ కేసీఆర్ ని పొగిడారు.రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 100 రేట్లు నయం అనేలా మాట్లాడారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

కెసిఆర్ తెలంగాణ రావడం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు.కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టిడిపి పార్టీలో ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుండా ప్రయత్నాలు చేశారు అంటూ చెప్పారు.

Advertisement

అయితే రేవంత్ రెడ్డిని విమర్శించినప్పుడు కేసీఆర్ ని పొగిడారు.కానీ ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ని విమర్శించారు.ఇలా బీఆర్ఎస్ ( BRS ) బిజెపి ఒక్కటి కాదు అని ఎన్నిసార్లు ప్రూవ్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడో ఓసారి నోరు జారీ ప్రజలకు దొరికిపోతున్నారు అని ఈ విషయం తెలిసిన చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

తాజా వార్తలు