జిమ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ తప్పుచేసి 21 ఏళ్ల యువకుడు మృతి..

ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన 21 ఏళ్ల జేక్ సెండ్లర్( Jake Sendler ) ఓ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ( MMA ) అథ్లెట్, ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా.

జిమ్‌లో బాగా కష్టపడి వర్కౌట్స్ చేయడం ఇతడికి అలవాటు.

అదే ఈ యువకుడికి శాపం అయింది.ఇటీవల అతిగా వ్యాయామం( Intense Exercise ) చేయడం వల్ల వచ్చే అరుదైన కండరాల వ్యాధితో జేక్ చనిపోయాడు.

ఈ నెలలో మెల్‌బోర్న్‌లో జరిగిన పోటీలో పాల్గొన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.ఆ తర్వాత డాక్టర్లు అతనికి రాబ్డోమియోలిసిస్( Rhabdomyolysis ) అనే భయంకరమైన జబ్బు ఉందని తేల్చారు.

ఈ జబ్బులో దెబ్బతిన్న కండరాలు విష పదార్థాలను రక్తంలోకి విడుదల చేస్తాయి.ఈ టాక్సిన్స్ కిడ్నీలతో సహా ముఖ్యమైన శరీర భాగాలను దెబ్బతీస్తాయి.

Advertisement
MMA Fighter Jake Sendler Dead At 21 Following Intense Exercise Details, MMA Figh

జేక్‌కి రాబ్డోమియోలిసిస్ ఉందని అతను సీరియస్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు.కండరాలు నొప్పిగా అనిపించినా అది మామూలే అనుకుని చాలా కఠినంగా వ్యాయామం చేస్తూనే ఉన్నాడు.

ఒకరోజు యూరిన్ టీ కలర్‌లో రావడాన్ని గమనించాడు.అది ఈ జబ్బుకి ముఖ్య లక్షణం.

కానీ దాన్ని కూడా పట్టించుకోకుండా డీహైడ్రేషన్ అనుకుని ఎక్కువ నీళ్లు తాగాడు.దాంతో పరిస్థితి మరింత విషమించింది.

Mma Fighter Jake Sendler Dead At 21 Following Intense Exercise Details, Mma Figh

వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.ఐసీయూలో చేర్చి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు.డాక్టర్లు చాలా సర్జరీలు చేసినా జేక్ శరీరం కోలుకోలేకపోయింది.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!

"ఇంకా చేసేది ఏమీ లేదు" అని డాక్టర్లు చెప్పినపుడు గుండె పగిలిపోయిందని జేక్ తల్లి షరోన్ సెండ్లర్ కన్నీళ్లతో చెప్పింది."అతని కండరాలు బాగా డ్యామేజ్ అయ్యాయి.

Advertisement

నేను అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని ఇక నువ్వు నిద్రపోవచ్చు నాన్నా అని చెప్పాను.వాడు చాలా గట్టిగా పోరాడాడు" అంటూ ఆమె దుఃఖించింది.

డాక్టర్లు కూడా జేక్ కేసు చూసి షాక్ తిన్నారు.వాళ్లు ట్రీట్ చేసిన కేసుల్లో ఇదే అత్యంత దారుణమైన రాబ్డోమియోలిసిస్ కేసు అని చెప్పారు.ఈ జబ్బు వల్ల కండరాలు విపరీతంగా దెబ్బతిన్నాయని, విష పదార్థాలు రక్తంలో కలిసిపోయి శరీరంలోని ముఖ్యమైన అవయవాలు పనిచేయకుండా పోయాయని తెలిపారు.

కొడుకుని కోల్పోయిన షరోన్ సెండ్లర్ ఇప్పుడు రాబ్డోమియోలిసిస్‌పై అందరికీ అవగాహన కల్పించాలని గట్టిగా నిర్ణయించుకుంది.దీన్ని "నిశ్శబ్ద హంతకి" అని పిలుస్తూ తనలాంటి బాధ ఇంకెవరికీ రాకూడదని కోరుకుంటోంది.

జేక్ జ్ఞాపకార్థం ఒక ఫండ్రేజింగ్ పేజీని కూడా స్టార్ట్ చేశారు.జేక్‌ను "MMA పోరాట యోధుడు, జీవితంలోనూ వీరుడు" అని గుర్తు చేసుకుంటూ.

అతనో అంకితభావం కలిగిన అథ్లెట్ అని, సహాయం చేసే కోచ్ అని, ప్రేమించే కొడుకు, సోదరుడు, స్నేహితుడని అందరూ కొనియాడుతున్నారు.

తాజా వార్తలు