ఫేక్ సర్వేలు అంటూ ఎమ్మెల్సీ కవిత సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది.దాదాపు 65 శాతానికి పైగానే పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ లో( Exit Polls ) ఫలితాలు సంచలనంగా మారాయి.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఈసారి అధికారంలోకి రాబోతున్నట్లు.

కొన్ని ఏజెన్సీ సంస్థలు ప్రకటించాయి.దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తరువాత కవిత( MLC Kavitha ) మీడియాతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అన్ని అబద్ధాలు చెబుతారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మటం లేదని స్పష్టం చేశారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని పేర్కొన్నారు.

అభివృద్ధిలో తెలంగాణతో ఎక్కడ సరితూగని ఉత్తర ప్రదేశ్.ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్.( CM Yogi Adityanath ) తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడాని తప్పుపట్టారు.

తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండా.తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టబోతున్నారు.

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు.బీఆర్ఎస్ 70కి పైగా స్థానాలలో గెలుస్తుందని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (సిపిఎస్) ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్లు పేర్కొన్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?

43 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్( BRS ) వెంట ఉన్నట్లు చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు వచ్చిన 36 స్థానాలకే పరిమితం కాబోతోంది.బీజేపీ ఒకటి నుంచి మూడు స్థానాలు ఇతరులు తొమ్మిది వరకు గెలిచే అవకాశం ఉందని సిపిఎస్ ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు వచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు