కేసీఆర్ ప్రకటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన ప్రకటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేగిన విషయం తెలిసిందే.

ఏకంగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సుముఖంగా ఉన్నామని తెలిపిన విషయం తెలిసిందే.

అయితే కేసీఆర్ చేసిన ప్రకటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.కేసీఆర్ ప్రకటించిన ఖాళీలు తప్పుల తడకగా ఉందని, మొత్తం లక్ష 90 వేల పోస్టులు ఉంటే కేవలం 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం ఎంత వరకు సబబు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి.

అయితే ఈ సమయంలో రాజకీయ పార్టీలు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని లేకపోతే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే జీవన్ రెడ్డి అభిప్రాయమా లేక కాంగ్రెస్ అభిప్రాయమా అనేది తెలియాలంటే రేవంత్ రెడ్డి స్పందన తరువాత తెలిసే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం కెసీఆర్ ప్రకటనతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో పార్టీల అభిప్రాయాలను నిరుద్యోగులు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది ప్రశ్నార్థకమైన విషయం.ఎందుకంటే గత పరిస్థితులను ఒకసారి విశ్లేషించుకుంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో కేసు వేసిన సందర్భంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై అగ్రహావేశాలు పెల్లుబుకాయి.

Advertisement

అయితే ప్రస్తుతం కెసీఆర్ ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడటం ఆ తరువాత నియామక ప్రక్రియపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ నియామక భర్తీ ప్రకటనపై సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది.

ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు