పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్..!!

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయాలు వేడెక్కాయి.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య విభేదాలు రాజుకున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తికి పల్లె రఘునాథ్ రెడ్డి చేసిందేమీ లేదని చెప్పారు.ఈ నేపథ్యంలో పుట్టపర్తి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

పుట్టపర్తి సత్యమ్మ ఆలయంలో ఏప్రిల్ 2 వ తేదీన ప్రమాణానికి సిద్ధమని వెల్లడించారు.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు.

సత్యమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి రెడీ అని చెప్పారు.పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి బాగోతం అందరికీ తెలుసని విమ‌ర్శించారు.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు