MLA Lasyanandita : అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత( BRS MLA Lasyanandita ) అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ( S Shantikumari )సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై సుల్తానాపూర్ వద్ద లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో ఆమె స్పాట్ లోనే చనిపోగా.

కారు డ్రైవర్ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది.దీంతో ఆమె మృతదేహాన్ని కంట్మోనెంట్ లోని ఆమె నివాసానికి తరలించనున్నారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...