ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్యే కవిత పేరు ప్రస్తావన

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది.

అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ పలు అభియోగాలు చేసింది.మద్యం పాలసీ ద్వారా కుంభకోణం జరిగిందని ఈడీ తెలిపింది.

సౌత్ గ్రూపులో అరుణ్ పిళ్లై కీలకమైన వ్యక్తి అని, కవిత ప్రతినిధిగా ఆయన వ్యవహరించారని ఆరోపించింది.లిక్కర్ వ్యాపారం డబ్బులతో భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

మనీలాండరింగ్ వ్యవహారంలో కవితను విచారించినట్లు ఈడీ కోర్టుకు వివరించింది.ఈడీ వాదనలు విన్న న్యాయస్థానం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని పిళ్లై న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అనంతరం తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు