రేవ్ పార్టీ కామెంట్స్ పై ఎమ్మెల్యే కాకాణి సవాల్..!!

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో టీడీపీ నేత సోమిరెడ్డి( TDP leader Somireddy ) చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ( MLA Kakani Govardhan Reddy )స్పందించారు.

ఈ క్రమంలో సోమిరెడ్డికి సవాల్ చేసిన కాకాణి తన పాస్ పార్ట్ పార్టీ జరిగిన ప్రాంతంలో దొరికితే రుజువు చూపించండని సూచించారు.

తన పాస్ పోర్ట్ తన దగ్గరే ఉందని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు.తన మీద బురద జల్లాలని ప్రయత్నించారని మండిపడ్డారు.

రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు.సోమిరెడ్డికి చీకటి కోణాలు చాలా ఉన్నాయన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో పురాతన పంచలోహా విగ్రహాలను సైతం సోమిరెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.

రేవ్ పార్టీతో కానీ, కేసు నిందితులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.తన పేరు మీద ఉన్న స్టిక్కర్ వాడకంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు